అదిలాబాద్ లో నేషనల్ హైవేకు మహర్ధశ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అదిలాబాద్ లో నేషనల్ హైవేకు మహర్ధశ

అదిలాబాద్, జనవరి 11, (way2newstv.com)
అదిలాబాద్ జిల్లాలోని జాతీయ రహదారికి మహర్దశ పట్టనుంది. ఏడేళ్ల కిందట నిర్మాణం పూర్తయిన ఈ రహదారిపై పలు లోపాలు ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఏడేళ్లకిందట నిర్మించిన నాలుగు వరుసల రహదారి నిర్మాణం లో పలు లోపాల కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే అథారిటీ  అవసరమైన చోట అండర్‌పాస్‌లు, స్లీప్‌రోడ్లు, బస్‌బేల నిర్మాణం కోసం రూ.62.55 కోట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణం కోసం టెండర్లు పిలిచి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటాం. జాతీయ రహదారి పొడవునా త్వరలోనే సెంట్రల్ లైటింగ్, సైడ్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తాం. అవసరమైన చోట్ల అండర్ పాస్‌లు, స్లీప్ రోడ్లు, సైడ్ రోడ్లు నిర్మించకపోవడం, బస్‌బేలను ఏర్పాటు చేయకపోవడం ప్రమాదాలకు కారణమని అధికారులు గుర్తించారు. 
అదిలాబాద్ లో నేషనల్ హైవేకు మహర్ధశ

జాతీయ రహదారి నిర్మాణంలో లోపాలపై  నేషనల్ హైవే అథారిటీ అధికారులతో సంప్రదించి ప్రమాదాలు జరుగుకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందించిన అధికారులు లోపాలను సరిదిద్దడంతో పాటు అవసరమైన చోట్ల నిర్మాణాలు చేపట్టేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఈ మేరకు కేంద్రం జాతీయ రహదారిలో నిర్మాణాలు, బస్‌బేల కోసం రూ.62.55 కోట్లు మంజూరు చేసింది. ఫలితంగా జిల్లాలోని జాతీయ రహదారి ప్రయాణం సురక్షితం కానుంది.జిల్లా లో 80 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి ఉంది. ఈ రోడ్డును ఏడేళ్ల కిందట నాలుగు వరుసల రహదారిగా విస్తరించారు. గతంలో జాతీయ రహదారి విస్తరణ పనులు జరిగినప్పుడు పర్యవేక్షణ లోపం, అవసరమైన చోట భద్రత చర్యలు చేపట్టకపోవడం లాంటి ప్రమాదాలు ఎక్కువగా సంభవిస్తున్నాయని ఇటీవల జరిగిన రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో చర్చించారు. ఏడాది కాలంలో జరిగిన ప్రమాదాలను పరిగణలోకి తీసుకొని అధికారులు 12 ప్రమాద స్థలాలులను గుర్తించారు. జాతీయ రహదారి నిర్మాణంలోని లోపాలపై ఎంపీ జి.నగేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. నేషనల్ హైవే అధారిటీ అధికారులను సంప్రదించి వారిని రహదారి పరిశీలనకు తీసుకొచ్చారు. ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను సైతం ఆయన వారికి చూపించారు. హైవేపై సాంకేతిక పరమైన లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రమాదాలు జరుగకుం డా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు స్పం దించిన అధికారులు అవసరైన చోట్ల అండర్‌పాస్‌లు, స్లీప్‌రోడ్లు, సైడ్ రోడ్లు, బస్‌బేల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశారు. నిధుల మంజూరు విషయంలో ఎంపీ కేంద్ర మంత్రులతో పాటు అధికారులు పలుసార్లు కలిసి అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆదిలాబాద్‌తో పాటు నిర్మల్ జిల్లాలో జాతీయ రహదారిలో పలు నిర్మాణాలకు రూ.61.96 కోట్లు మంజూరు చేసింది. నిధులతో గుడిహత్నూర్ బస్టాండ్ వద్ద రూ.21.22 కోట్లతో అండర్‌పాస్,నిర్మల్ జిల్లా సోన్ వద్ద రూ.11.47 కోట్లతో అండర్‌పాస్‌లను నిర్మించనున్నారు. వీటితో పాటు ఇచ్చోడ మండల గాంధీనగ ర్ వద్ద వంతెనను సాంకేతికంగా సరిదిద్దుతారు. జైనథ్ మండలం భోరజ్ ఎక్స్‌రోడ్, ఆదిలాబాద్ మండలం జందాపూర్ ఎక్స్‌రోడ్, బట్టి సవర్‌గాం ఎక్స్‌రోడ్‌లో రెండోవైపు రహదారి నిర్మాణం, జాతీయ రహదారి వెంబడి అవసరమైన ప్రాంతాల్లో స్లీప్‌రోడ్లు, సైడ్ రోడ్లను నిర్మిస్తారు. వీటితో పాటు నేషనల్ హైవేకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ మండలం కామాయి, పూసాయి, మండగడ, తలమడుగు మండలం దేవాపూర్, వాఘాపూర్, గుడిహత్నూర్ మండలం మేకలగండి, నేరడిగొండ మండలం లక్కంపూర్, కిష్టాపూర్, రోల్‌మామడ, బుర్కుపల్లి వద్ద బస్ బేలను ఏర్పాటు చేస్తారు. ఇందు కోసం రూ.29.86 కోట్లు మంజూరయ్యాయి. వీటి నిర్మాణలతో ఆయా గ్రామాల ప్రజల కు సౌకర్యం కలుగుతుంది. ప్రధానంగా గుడిహత్నూర్ బస్టాండ్ ఎదురుగా అండర్‌పాస్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు ఎదుర్కొవాల్సి వచ్చేది. నిర్మల్ వైపు వెళ్లాలంటే రోడ్డు దాటి పోవా లి. ఇక్కడ అండర్‌పాస్ నిర్మిస్తుండడంతో ప్రమాదాలను నివారించవచ్చు.