ఆడియో టేపుల వ్యవహారం... పృధ్వీరాజ రాజీనామా - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆడియో టేపుల వ్యవహారం... పృధ్వీరాజ రాజీనామా

తిరుపతి, జనవరి 13 (way2newstv,com)
సినీనటుడు, ఎస్వీబీసీ చైర్మన్ పృధ్వీ రాసలీలల ఆడియో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఎస్వీబీసీలో పని చేస్తున్న మహిళా ఉద్యోగితో అసభ్యకరంగా మాట్లాడుతున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తక్షణం విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. విజిలెన్స్ నివేదిక వచ్చిన తరువాత తదుపరి చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు.ఆడియో టేపుల వ్యవహారంపై ఇప్పటికే టీటీడీ చైర్మన్ వైవీ పృధ్వీరాజ్‌కి ఫోన్ చేసి ఆరా తీసినట్లు తెలుస్తోంది. ఆ ఆడియో టేపులతో తనకెలాంటి సంబంధం లేదని.. ఎవరో మిమిక్రీ చేసి తనపై బురదజల్లేందుకు యత్నిస్తున్నారని చెప్పినట్లు సమాచారం. 
ఆడియో టేపుల వ్యవహారం... పృధ్వీరాజ రాజీనామా

తనను బద్నాం చేయడానికి ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన ఆరోపించినట్లు తెలుస్తోంది.టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఎస్వీబీసీ కార్యాలయానికి వెళ్లి ఉద్యోగుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పృధ్వీ వ్యవహారశైలి తదితర విషయాలపై ఆరా తీస్తున్నారు. విజిలెన్స్ విచారణ అనంతరం తప్పని తేలితే సీఎం జగన్‌ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని వైవీ ఇప్పటికే స్పష్టం చేశారుఎస్వీబీసీ చైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తి మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించడాన్ని మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. తక్షణమే పృధ్వీ ఎస్వీబీసీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. పృధ్వీపై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని కోరుతున్నాయి. కమెడియన్ పృధ్వీ.. ఇక్కడికి వచ్చిన తరువాత రాసలీలల పృధ్వీ అయ్యాడంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.పృధ్వీ మహిళా ఉద్యోగితో మాట్లాడుతూ అన్నం తినేటప్పుడు నేను నీకు గుర్తు రాలేదా..? పడుకునేటప్పుడు గుర్తుకు రాలేదా? అంటూ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఆడియో టేప్ వైరలైంది. మార్చి వరకు మద్యం తాగనని.. డ్రింక్ చేయడం మొదలుపెడితే.. నీ దగ్గర కూర్చొని మొదలుపెడతానని వ్యాఖ్యానించారు. వెనుక నుంచి వచ్చి నిన్ను గట్టిగా పట్టుకుందామని అనుకున్నాను. కానీ కెవ్వుమని అరుస్తావేమోనని భయపడి ఆగిపోయానని పృథ్వీ మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఆడియో బయటకు వచ్చింది.ఇప్పటికే అమరావతి రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ విమర్శలు చేసి పృధ్వీ వివాదంలో చిక్కుకున్నారు. ఆడి కార్లు.. బంగారు గాజులు వేసుకునే వాళ్లు రైతులా? రైతుల ముసుగులో కార్పొరేట్ ఉద్యమం నడుస్తోందంటూ తీవ్ర విమర్శలు చేశారు. రైతులను ఉద్దేశించి పృధ్వీ చేసిన వ్యాఖ్యలపై సొంత పార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. వైసీపీ నేత, రచయిత పోసాని కృష్ణ మురళి తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారుఅమరావతి రైతులపై పృధ్వీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధిష్టానం కూడా సీరియస్ అయినట్లు సమాచారం. రైతులపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. కులాల ప్రస్తావన వచ్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని సీఎం వైఎస్ జగన్ కూడా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయమై విమర్శలు వెల్లువెత్తుతుండగానే పృధ్వీ మరో వివాదంలో చిక్కుకున్నారు. అది కూడా రాసలీలల వ్యవహారం.. ఇక ఆయనను ఆ దేవుడే కాపాడాలి మరి.