జెండా తిప్పేశారు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జెండా తిప్పేశారు...

ముంబై, జనవరి 27 (way2newstv.com)
మహారాష్ట్ర నవనిర్మాణ సేన తన జెండాను మార్చింది. పార్టీ జెండా కలసి రాకపోవడంతో బాల్ థాక్రే జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆ పార్టీ అధినేత రాజ్ థాక్రే కొత్త జెండాను కార్యకర్తల ముందు ఉంచారు. మహారాష్ట్రలో శివసేన ఆవర్భావం నుంచి బాల్ థాక్రే వెంట నడిచిన రాజ్ ధాక్రే ఆ తర్వాత ఆయనతో విభేదించి బయటకు వచ్చారు. బాల్ థాక్రేను మాత్రం రాజ్ థాక్రే గౌరవిస్తారు. కానీ ఆ కుటుంబంలో వచ్చిన మనస్పర్థల కారణంగానే శివసేన నుంచి బయటకు వచ్చారు.అయితే సొంతంగా రాజ్ థాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను పెట్టారు. తన పెదనాన్న బాల్ థాక్రే వద్ద రాజకీయ మెళకువలు తెలుసుకున్న రాజ్ థాక్రే మరాఠా నినాదంతోనే పార్టీని స్థాపించారు. బాల్ థాక్రే మరణం తర్వాతనే రాజ్ థాక్రే శివసేననుంచి బయటకు వచ్చారు. 
జెండా తిప్పేశారు...

తనకు పార్టీ పగ్గాలు అందుతాయని భావించి వెయిట్ చేసినా శివసేన అధిపతిగా ఉద్ధవ్ థాక్రే నియమితులు కావడంతో రాజ్ థాక్రే సొంత పార్టీ పెట్టుకున్నారు.మహారాష్ట్ర నవనిర్మాణ సేన ను స్థాపించిన తొలిసారి జరిగిన 2009 ఎన్నికల్లో బరిలోకి దిగింది. అయితే ఈ సమావేశాల్లో 13 అసెంబ్లీ స్థానాలను సాధించారు. దీంతో రాజ్ థాక్రే కు రాజకీయ భవిష్యత్తు ఉందని అందరూ భావించారు. 2014 ఎన్నికల్లో కేవలం ఒక సీటును మాత్రమే సాధించింది. అయితే పదేళ్లుగా రాజ్ థాక్రే ఆ పార్టీని నడుపుతూనే ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ దాదాపుగా అదే పరిస్థితి. దీంతో రాజ్ థాక్రే తనకు పార్టీ కలసి రాలేదని భావించారు. ముఖ్యంగా జెండా అచ్చిరాలేదని ఆయన గత కొంతకాలం నుంచి దానిపైనే సిద్ధాంతుల సలహాలు కూడా తీసుకున్నారు.సిద్ధాంతులు జెండా మార్చాలని సూచించడంతో రాజ్ థాక్రే జెండాను మార్చేశారు. కాషాయరంగు, నలుపు రంగులతో కొత్త జెండాను తీర్చిదిద్దారు. గతంలో కాషాయం, నీలం, ఆకుపచ్చ రంగులు ఉండేవి. కొత్త జెండాను ఆవిష్కరించడంతో క్యాడర్ లో కూడా ఉత్సాహం పెరిగిందంటున్నారు. ఇటీవల దేవేంద్ర ఫడ్నవిస్ తో కూడా రాజ్ థాక్రే సమావేశమయ్యారు. రానున్న కాలంలో బీజేపీతో కలసి పోటీ చేసే అవకాశముంది. జెండా మార్చడంతోనైనా రాజ్ థాక్రేకు కలసి వస్తుందేమో చూడాలి.