ఉద్యమంలా అక్షరాస్యత కార్యక్రమం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉద్యమంలా అక్షరాస్యత కార్యక్రమం

సిద్దిపేట జనవరి 03(way2newstv.com)
సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామంలో నిర్మించనున్న కస్తూర్భా గాంధీ బాలికల పాఠశాల- కేజీబీవీ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుక్రవారం శంకుస్థాపన చేసారు. తరువాత  మిరుదొడ్డి మండలం మల్లుపల్లి, లక్ష్మీ నగర్, జంగపల్లి, మోతె, మిరుదొడ్డి  గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, డీఈఓ రవికాంత్, నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల ఏంపీపీలు, జెడ్పిటీసీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.మంత్రి మాట్లాడుతూ  అక్షరాస్యత కార్యక్రమం ఉద్యమంలా చేపట్టాలి.  రాష్ట్రంలో సిద్దిపేటను వందశాతం  అక్షరాస్యత జిల్లా చేద్దాం.  
ఉద్యమంలా అక్షరాస్యత కార్యక్రమం

పదోతరగతి, ఇంటర్ పరీక్షల్లో వందశాతం  ఫలితాలు సాధించాలి.  గ్రామాలు స్వచ్చ గ్రామాలు కావాలని అన్నారు. తరువాత కస్తూర్భా, మోడల్ స్కూల్ విద్యార్థుల తో ముచ్చటించారు. గత ఏడాది పదో తరగతి పరీక్షలలో మోడల్ స్కూల్, కస్తుర్బా బాలికల ఫలితాలుఎలా ఉన్నాయని ప్రిన్సిపాల్ ను ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షలలో గత ఏడాది వంద శాతం ఫలితాలు సాధించామని ప్రిన్స్ పాల్స్ తెలిపారు. దాంతో వారిని మంత్రి . అభినందించారు.తరువాత గ్రామంలో పల్లె ప్రగతి సమీక్ష నిర్వహించారు. రూ 2 కోట్ల రూపాయలతో హాస్టల్ బిల్డింగ్ నిర్మించుకోవడం  అభినందనీయం.  10 వతరగతిలో 10/10 జీపీయే సాధించిన విద్యార్థులకు రూ.25.000 నగదు బహుమతి ఎమ్మెల్యే రామలింగారెడ్డి అందిస్తారు.  రానున్న రెండు నెలలు విద్యార్థులు మనసుపెట్టి చదవాలి.  ప్రతివిద్యార్థి యోగా చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చిన ఈచ్ వన్ టీచ్ వన్ ను ఊరూరా అమలు చేసి సిద్ధిపేట జిల్లాను అక్షరాస్యతలో నెంబర్ 1 గా నిలపాలి.  ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అక్షరాస్యతా ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలి.  ఏంఈఓ, డీఈఓలు రెగ్యులర్ గా పాఠశాలలను విధిగా విజిట్ చేయాలి.10 వ తరగతిలో 100 శాతం రిజల్ట్స్ తేవాలి. అందరమూ కష్టపడి విద్యా వ్యవస్థను బాగు చేయాలని అన్నారు.  మిషన్ భగీరథ నీరు గ్రామాల్లోని ప్రతి ఇంటికి చేరేలా చూడాలి.  పల్లె ప్రగతిలో ప్రతి గ్రామ పంచాయతీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ట్రాక్టర్ లను మంజూరు చేశారు.  ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమైన స్వచ్ఛ తెలంగాణ సాధనకు అన్ని గ్రామాల సర్పంచ్ లు కృషి చేయాలి.  ప్రతి గ్రామం 100 శాతం అక్షరాస్యత సాధించేందుకు ప్రజా ప్రతినిధులు ప్రతిన బూనాలి. నాటిన ప్రతి చెట్టును కాపాడాలి.  ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతర కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయించారు.  త్వరలోనే దుబ్బాక నియోజకవర్గానికి గోదావరి జలాలు రాబోతున్నాయి.  కరువు అనే పదం ఇక మనం డిక్షనరీలో  చూసినా కనిపించదు. గ్రామాల్లో యువత పనిలేకుండా ఉండొద్దు.  యువత వ్యవసాయం పై దృష్టి సారించాలని మంత్రి అన్నారు. మిరుదొడ్డిలో ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ  పేద విద్యార్థులకు కేజీబీవీ పాఠశాలలు ఎంతో ఉపయోగపడతాయి.  సమాజంలో డబ్బు ఉన్న వారికంటే చదువుకున్న వారికే ఎక్కువ గౌరవం ఉంటుంది.  రెండున్నర కోట్ల రూపాయలు మంజూరు చేయించి.. పాఠశాలను నిర్మింప జేస్తున్న మంత్రి హరీష్ రావుకు ధన్యవాదాలు.  తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తున్నారు. వారి ఆశయాలను పిల్లలు నెరవేర్చాలని అన్నారు.