ఉద్యోగి నిత్య విద్యార్థిగా పనిచేయాలి

హైదరాబాద్  జనవరి 3 (way2newstv.com)
గ్రూప్ 2 ద్వారా సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా ఎంపికయిన 60 మంది అధికారులకు రాజేంద్రనగర్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కో - ఆపరేటివ్ మేనేజ్ మెంట్ లో శిక్షణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అగ్రరాజ్యం భారతదేశమే.  సమయాన్ని, జీవితాన్ని లక్ష్యసాధన కొరకే ఉపయోగించండి.  రాబోయే కాలం భారతదేశ యువతదే.  ప్రపంచంలోని ఏ దేశానికి ఇంత అవకాశం లేదు.  ఈ దేశంలో ఉన్న యువతది ఇక ముందు కీలకపాత్ర పోషిస్తుంది.  రేపటి తరాన్ని నడిపేది మీరేనని అన్నారు.  
 ఉద్యోగి నిత్య విద్యార్థిగా పనిచేయాలి

ఇప్పుడు మీరు ఎంత స్వచ్చంగా ఉద్యోగంలో చేరుతున్నారో నిరంతరం అదే స్వచ్ఛతతో పనిచేసి పదవీ విరమణ చేయండి. ప్రజలే కేంద్ర బిందువులుగా ఆలోచించి పనిచేయండి.  నా వద్ద కానిస్టేబుల్ గా పనిచేసిన వ్యక్తి గ్రూప్ 2 అధికారిగా ఎంపికయ్యాడు. లక్ష్యం మీద దృష్టి ఉంటే ఏదీ అసాధ్యం కాదు.  ఏడాదిపాటు శిక్షణ పొందే అవకాశం మళ్లీ రాదు.  శిక్షణను శ్రద్ధగా పూర్తిచేయండి. ప్రజాస్వామ్యం అంటే ఏంటో ప్రజలకు తెలియకుండానే ముందుకు సాగుతున్నాం. మారుతున్న కాలాన్ని బట్టి ప్రజలే అభిలాషతో తమ పిల్లలను బడికి పంపుతున్నారని అన్నారు.  కానీ ఎక్కడా దేశంలో ప్రభుత్వాలు పట్టుబట్టి పిల్లలను విద్య వైపు తీసుకెళ్లిన పరిస్థితి లేదు.. తెలంగాణ రాష్ట్రం వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్  ఆ దిశగా ప్రజలను అడుగులు వేయిస్తున్నారు.  పలు ప్రత్యేక పథకాలతో విద్యార్థులకు విద్య పట్ల ఆసక్తి కలిగేలా చేస్తున్నారు.  ప్రజలు సాంఘీకంగా, విద్యాపరంగా కూడా అభివృద్ధి కావాలి. కొన్ని దేశాలలో ఏదైనా పనిమీద ఒక కార్యాలయానికి ప్రజలు వెళ్తే రెండవసారి ఆ పని మీద వెళ్లాల్సిన అవసరం ఉండదు.  మన దేశంలో  ఆ పరిస్థితి లేదు .. ప్రజలు చైతన్యం అయితేనే అది సాధ్యమవుతుంది. సహకార శాఖ అంటే సమిష్టి నిర్ణయం.  అది ప్రజలు, సంస్థ లబ్దికొరకే పనిచేస్తుంది.  ప్రపంచ యుద్ధాలు సహకార వ్యవస్థ బలంగా ఉన్న దేశాల అర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపలేక పోయాయి.  భారతదేశంలో గతంలో ఆర్థికమాంద్యం ప్రభావం చూపకపోవడానికి కారణం కూడా సహకార వ్యవస్థనే.  సహకార సంఘాల గౌరవాన్ని పెంచడానిక మీరు శక్తివంచన లేకుండా కృషిచేయాలి.  ప్రముఖులైన ప్రతి ఒక్కరూ పేదరికం నుండి వచ్చినవారే.   ఆత్మవిశ్వాసం ఉంటే ఏదయినా సాధించగలం. నేను కూడా రైతు బిడ్డనే .. మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చాను. ఆశావాద దృక్పధంతో ఉండండి .. ప్రజలు కేంద్రంగా ఆలోచించండి.  ఉద్యోగి నిత్య విద్యార్థిగా పనిచేయాలి.  సహకార శాఖలో ఉన్న సిబ్బంది కొరతను తీర్చుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార శాఖ కమీషనర్ వీరబ్రహ్మయ్య,  ఐసీఎం డైరెక్టర్ హెచ్ ఎస్ కె తంగిరాల, ఎన్ సీడీసీ చీఫ్ డైరెక్టర్ తేజోవతి, అడిషనల్ రిజిస్ట్రార్ సుమిత్ర  పాల్గొన్నారు.
Previous Post Next Post