తిరుపతిలో కమలం జోరు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుపతిలో కమలం జోరు

తిరుపతి, జనవరి 2, (way2newstv.com)
చంద్రబాబు సొంత జిల్లాలో భారతీయ జనతా పార్టీ పట్టు పెంచుకుంటోంది. చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డమ్మీగా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్యంతో రాజకీయాలకు దూరం కావడం, ఆయన తనయుడు సుధీర్ రెడ్డి అంతగా పట్టు సంపాదించుకోలేక పోవడంతో ఇక్కడ బీజేపీ స్ట్రాంగ్ అవుతుంది. గత కొద్దిరోజులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను చూస్తుంటే బీజేపీ ఇక్కడ పుంజుకుంటుందనే చెప్పాలి.శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మధుసూధన్ రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ టీడీపీతో మధుసూధన్ రెడ్డికి ఎలాంటి వివాదాలు లేవు. 
 తిరుపతిలో కమలం జోరు

వారు సైలెంట్ అయిపోవడంతో మధుసూధన్ రెడ్డి నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టి పెట్టారు. కానీ ఇక్కడ బీజేపీ నేత కోలా ఆనంద్ పరిస్థితులను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. కోలా ఆనంద్ గతంలో కాంగ్రెస్ లో ఉండేవారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. గత ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన కోలా ఆనంద్ పెద్దగా ఓట్లను సంపాదించుకోలేకపోయారు.అయినా ఆయన వైసీపీ ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డితో ఢీ అంటే ఢీ అంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక వార్డులో జరిగిన కార్యక్రమంలో మధుసూదన్ రెడ్డికి, బీజేపీ నేతకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో ఆ బీజేపీ నేతపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కోలా ఆనంద్ కేంద్రంలోని పెద్దలకు ఫిర్యాదు చేశారు. కోలా ఆనంద్ హోంమంత్రి అమిత్ షాను కలసి శ్రీకాళహస్తి లో జరుగుతున్న సంఘటనపై చర్చించారు. కోలా ఆనంద్ మోదీని కూడా కలిశారు. ఈ వివాదం కేంద్రం పెద్దల వద్దకు చేరడంతో పోలీసులు సయితం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు.ఏడాదిన్నర క్రితమే బీజేపీలో చేరిన కోలా ఆనంద్ పట్టు పెంచుకుంటుండటంతో బీజేపీ రాష్ట్ర నేతలు సయితం ఆయన వెన్నంటే ఉన్నారు. దీంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ వర్సెస్ బీజేపీ గా మారింది. ఇక్కడ వైసీపీకి తానే అసలైన ప్రత్యర్థి అంటూ బీజేపీ నేత కోలా ఆనంద్ ప్రచారం చేసుకుంటున్నారు. టీడీపీ నేత బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటంతో దశాబ్దాలుగా టీడీపీకి పట్టున్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ థర్డ్ పొజిషన్ కు వెళ్లిపోయిందంటున్నారు. మొత్తం మీద చంద్రబాబు సొంత జిల్లాలోని నియోజకవర్గంలో బీజేపీ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ వైసీపీ కూడా బీజేపీనే తన ప్రధాన శత్రువుగా చూస్తుండటం విశేషం