ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు

ఏలూరు, జనవరి 2, (way2newstv.com)
రైతులు రానున్న రోజుల్లో మీసేవా కేంద్రాలు, బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వ్యవసాయశాఖ సిబ్బంది వద్ద ఈ–కర్షక్‌ యాప్‌లో పంట వివరాలు నమోదు చేసుకుంటే చాలు, పంటల బీమా వర్తించినట్లే. ఆ మేర వ్యవసాయశాఖ ఈ రబీ నుంచే ఈ నూతన విధానానికి శ్రీకారం చుట్టనుంది. రాష్ట్ర వ్యవసాయశాఖ పంటల బీమాపై సరికొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. గత ఏడాది రబీ వరకు ప్రధానమంత్రి ఫసల్‌బీమా కింద ఎంపిక చేసిన ఏజెన్సీకి రైతులే బీమా ప్రీమియం చెల్లించేవారు. ఆ తర్వాత ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలని నిర్ణయించింది. గడిచిన ఖరీఫ్‌కు కూడా ప్రభుత్వమే ప్రీమియంను రైతులు బ్యాంకులు, మీ సేవ కేంద్రాల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. 
 ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు

ఇక ఈ ఏడాది నవంబరులో రబీ పంటల బీమాకు షెడ్యూల్‌ విడుదల చేసినా...సంబంధిత వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం నమోదు ప్రక్రియలోనూ మార్పులు చేసింది. ఇకపై ఈ–కర్షక్‌ యాప్‌లో పంటలు నమోదు చేసుకున్న వారికి బీమా వర్తింపచేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రైతులకు వెసులుబాటు కలగనుంది. ఇకపై ఏటా ఖరీఫ్, రబీ సీజన్‌లో ఈ–కర్షక్‌ యాప్‌ ద్వారా రైతులు వేసిన పంటలను నమో దు చేస్తారు. వ్యవసాయశాఖ ద్వారా అమలు చేసే రాయితీ పథకాలు మొత్తం దీని ఆధారంగానే అందజేస్తారు. రైతులు గ్రామ సచివాలయానికి వెళ్లి మొబైల్‌ అప్లికేషన్‌ నమోదు చేసుకోవాలి. ఈ ప్రక్రియను పర్యవేక్షించేందుకు జేడీఏ కార్యాలయంలో ఒక నోడల్‌ అధికారిని నియమిస్తారు. అంతర్‌పంటలు, పండ్లతోటలు, కూరగాయల సాగు, మొదటి, రెండు, మూడు పంటలు దేనికి దానికి యాప్‌లో సమగ్ర వివరాలు నమోదు ఆప్షన్లు ఇచ్చారు. గ్రామ సచివాలయ స్థాయి నమోదు ప్రక్రియను సంబంధిత వ్యవసాయాధికారి పర్యవేక్షించి నమోదయిన డేటాను తప్పనిసరిగా ఎప్పటికప్పుడు అ«దీకృతం చేయవలసి ఉంటుంది. సమాచారాన్ని జేడీఏ కార్యాలయంలో కేటాయించిన అధికారి పర్యవేక్షణ అనంతరం జిల్లా జేడీఏ కార్యాలయంలో నియమించిన అధికారి కమిషనరేట్‌ కార్యాలయానికి సమాచారం అందిస్తూ ఉంటారు. ఇకపై బ్యాంకు ద్వారా రుణం పొందేవారు..ఆయా బ్యాంకుల్లో బీమా కింద రిజి్రస్టేషన్‌ చేయించుకోనవసరం లేదు. రుణం పొందని వారు కామన్‌సరీ్వసు సెంటర్‌లో నమోదు చేసుకోనవసరం లేదు. ఏ బీమా కంపెనీకి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. అక్టోబరు 1, 2019 తర్వాత బ్యాంకులు పంట రుణం నుంచి బీమా ప్రీమియం వసూలు చేసి ఉంటే, దానిని తిరిగి రైతులకు చెల్లిస్తారు. బ్యాంకులు రైతుల వద్ద వసూలు చేసిన ప్రీమియం సొమ్మును కంపెనీకి జమ చేసి ఉంటే తిరిగి చెల్లిస్తారు. అర్హత కలిగిన అన్ని క్లెయిమ్‌లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా సంబంధిత సాగుదారుని ఆధార్‌ అనుసంధానం బ్యాంకు ఖాతాకు జమ చేస్తుందినూతన విధానం అమలుకు వ్యవసాయశాఖను నోడల్‌ ఏజెన్సీగా ఎంపిక చేశారు. పంటల బీమా పథకంలో చేరడానికి ముందుగా ఆధార్‌ కలిగిన సాగుదారుడి వివరాలు ఇ–కర్షక్‌ అనే ఆండ్రాయిడ్‌ యాప్‌లో నమోదు చేస్తారు. అందుకోసం నిరీ్ణత గడువు విధించారు. రబీలో శనగపంటకు జనవరి 31, మిగిలిన అన్నిపంటలకు ఫిభ్రవరి 15 గడువుగా పేర్కొన్నారు. సొంత రైతు, కౌలు రైతు అనే వివరాలు ఇ–కర్షక్‌యాప్‌ ద్వారా గుర్తిస్తారు.