నెల్లూరు జనవరి 6 (way2newstv.com)
నెల్లూరు గ్రామీణ నియోజవర్గ పరిధిలోని దొంతాళి, ఆమంచర్ల, సౌత్ మోపూరు తదితర ప్రాంతాలలో 5 కోట్ల 25 లక్షల తో వివిధ అభివృద్ధి పనులకు నెల్లూరు గ్రామీణ నియోజవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోమవారం శంకుస్థాపనలు చేశారు. కందమూరు , కొత్త ఎల్లంటి, పాత ఎల్లంటి తదితర గ్రామాల లోనూ 1కోటి 93 లక్షలతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు గ్రామీణ మండలంలో 17 గ్రామాలలో 55 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడం జరిగింది అన్నారు.
గ్రామీణంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కోటం రెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమమే గేయంగా రాష్ట్ర పరిపాలన సాగిస్తున్నారని తెలియజేశారు. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి గ్రామీణ ప్రాంతాలే తొలుత అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన చేస్తున్న కార్యక్రమాలు సజావుగా సాగకుండా ప్రతిపక్ష నేతలు అడుగడుగునా అడ్డు పడుతున్నప్పటికీ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు వైయస్ జగన్మోహన్ రెడ్డి శాయశక్తుల తన వంతు కృషి చేస్తున్నాడని తెలిపారు. ఈ క్రమంలోనే నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ పరిధిలోని రూరల్ మండలానికి 55 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ పనులు చేయాలంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు 100% రిజల్ట్స్ చూపించవలసిన అవసరం ఉందన్నారు. తన తుది శ్వాస వరకు నెల్లూరు గ్రామీణ నియోజవర్గ ప్రజల ఆశయాలను నెరవేర్చే దిశగా తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలతో పాటు స్థానికులు పాల్గొన్నారు.