"కాక్ టైల్" ప్రారంభం. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

"కాక్ టైల్" ప్రారంభం.

చిత్రలహరి మూవీ మేకర్స్ పతాకంపై జై దర్శకత్వంలో,అట్లూరి మాదవి నిర్మించనున్న హిలెరియస్ కామెడీ ఎంటర్ టైనర్ "కాక్ టైల్". ఈచిత్ర ప్రారంభోత్సవం ఇటీవల ఫిల్మ్ నగర్ ధైవసన్నిదానం లో పూజా కార్యక్రమాలతో  ప్రారంభమైంది.ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు జై మాట్లాడుతూ "యువత భవిత పై సోషల్ మీడియా ప్రభావం"అనే అంశంతో,అన్నికమర్షియల్ హంగులతో రూపుదిద్దుకొనున్న చిత్రమిది.పాత,కొత్త ఆర్టిస్ట్ లతో ఈ చిత్రం తెరకెక్కనుంది. 
 "కాక్ టైల్" ప్రారంభం.

ఫిబ్రవరి 2 నుంచి రెగ్యులర్ షూటింగ్ హైదరాబాద్,గోవాలలో జరపనున్నాం. అన్నారు.ఈ చిత్రానికి కధ,మాటలు:శ్రీకుమార్ దాలిపర్తి సంగీతం:భాను.జె. ప్రసాద్,కేమెరా:శ్రీనివాస్ సబ్బి,డాన్స్:శైలజ, రాక్ వేణు ఫైట్స్:నాబా,ఎడిటింగ్:శివ,సమర్పణ:పవన్ కుమార్ వాసికర్ల,పి.ఆర్.ఓ:బి.వీరబాబు,ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్:ఆనంద్.వి,ప్రొడ్యూసర్:అట్లూరి మాధవి, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:జై