వరంగల్ జనవరి 6 (way2newstv.com)
రెండో విడత పల్లె బాట కార్యక్రమంలో భాగంగా సోమవారం కమలాపూర్ మండలంలోని శంభుని పల్లె నర్సరీ ప్రాథమిక పాఠశాల అంగడి వాడి కేంద్రం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ పరిశీలించారు. వైకుంఠధామం కౌంపౌండ్ వాల్ కు నిధులు, అవెన్యూ ప్లాంటేషన్ ఇంకుడు గుంతలు డంపింగ్ స్మశాన వాటికల నిర్మాణం పూర్తైయిన గ్రామాలకు నగదు ప్రోత్సహకం అందిస్తాం మని కలెక్టర్ వెల్లడించారు. సెప్టెంబర్ 5 నుండి జి.పి విద్యుత్ బిల్లులు చెల్లించాలి.
పదవ తరగతి ఉత్తిర్ణత శాతం పెంచాలి
అయితే, విద్యుత్ ఏరియర్స్ బిల్లులు చెలకించాల్సిన అవసరం లేదని అన్నారు. తరువాత భీంపల్లిలో కమ్యూనిటీ టాయిలెట్ ను కలెక్టర్ ప్రారంభించారు. గ్రామంలో వీధుల రోజు వారీ చెత్త సేకరణ షెడ్యూల్డ్ పై అవగాహన ప్రజలకు కల్పించాలి. స్మశాన వాటిక నిర్మాణ పనులను నెల రోజుల్లో పూర్తీ చేయాలని అన్నారు. జిల్లా పరిషత్, ప్రాథమిక పాఠశాల పరిశీలన విధ్యార్ధుల సంఖ్యను పెంచాలి వచ్చే విద్య సంవత్సరంలో వార్డుకు 10 చొప్పున విద్యార్థులను చేర్పించాలి. పదవ తరగతి లో100 శాతం ఉత్తీర్ణత శాతం పెరిగేందుకు ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేయాలని హెచ్ ఎమ్ ను ఆదేశించారు.