కేసీఆర్ బయోపిక్ లో టాలీవుడ్ సీజన్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కేసీఆర్ బయోపిక్ లో టాలీవుడ్ సీజన్

హైద్రాబాద్, జూన్ 29(way2newstv.com)
ప్రస్తుతం టాలీవుడ్‌ లో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. ఇప్పటికే సావ్రితి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి ఘనవిజయం సాధించగా ఇటీవల మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా యాత్ర సినిమా ప్రారంభమైంది. తాజాగా మరో రాజకీయ నాయకుడి జీవిత కథ వెండితెరకెక్కేందుకు సిద్ధమవుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ సారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బయోపిక్‌ ఈ రోజే  ప్రారంభమైంది.ఈ సినిమాలో కేసీఆర్‌ పాత్రలో సీనియర్‌ నటుడు నాజర్‌ నటిస్తున్నారు. కల్వకుంట్ల నాగేశ్వర్‌రావు నిర్మిస్తున్న ఈ సినిమాకు అల్లూరి కృష్ణంరాజు దర్శకుడు. ‘ఉద్యమ సింహం’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాను కేసీఆర్‌ తెలంగాణ సాధన కోసం దీక్షను ప్రారంభించిన నవంబర్‌ 29న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇతర నటీనటులు వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు.
 
 
 
కేసీఆర్ బయోపిక్ లో టాలీవుడ్ సీజన్