జనం లేని బీజేపీ సభలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జనం లేని బీజేపీ సభలు

హైదరాబాద్, జూన్ 30, (way2newstv.com)
అక్కడక్కడా జనం లేని సభలు బీజేపీ పెడుతూ సీఎం పై చేస్తున్నా ఆరోపణలను ఖండిస్తున్నామని తెరాస ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ అన్నారు. శుక్రవారం నాడు అయన అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేసిన బస్ యాత్ర పేరు మార్చి  బీజేపీ వాళ్ళు మరో యాత్ర చేస్తున్నారు. కాంగ్రెస్ వాళ్ళ ప్లాప్ యాత్ర లా ,  బీజేపీ వాళ్ళది తయారు అయ్యిందని అయన అన్నారు. అసహనానికి గురయ్యి బీజేపీ లక్ష్మణ్  మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తో అనేక అవార్డ్స్ అందుకున్న రాష్ట్రన్నా మీరు విమర్శించేదని ప్రశ్నించారు. బీజేపీ వాళ్ళు ఇచ్చే హామీలలో  2 లక్షల రుణమాఫీ మోడీ గారి నోటి వెంట చెప్పించాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రం గూర్చి,  హక్కుల గూర్చి బీజేపీ వాళ్ళు మోడీ ని ఆడిగారా అని అన్నారు. ప్రజల లో బీజేపీ పై చులకలనా భవం ఉంది అని మాట్లాడుతున్నారు. మధ్యప్రదేశ్ లో 40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం అని  మాట తప్పారు. తెలంగాణ లో కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నేర వేర్చమ్ అని ప్రజలకు చెప్పే ద్యేర్యం బీజేపీ రాష్ట్ర నాయకులకు ఉందా అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తో మా హక్కుల పై పోరాటం చేస్తూ...మా ప్రజలకు మంచి పనుల  కోసం కొన్ని విషయాల పై  సపోర్ట్ చేస్తాం. బీజేపీ కి ఓట్ల కోసం యావ తప్ప ఏమీ లేదని అన్నారు. రామమందిరం నిర్మించి తీరుతామని లక్ష్మణ్  చెబుతున్నారు. తెలంగాణ ప్రశాంతం గా ఉంది. ఓట్ల కోసం ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని అయన అన్నారు.                                                               జనం లేని బీజేపీ సభలు