హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్.

 (way2newstv.com)
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ జంటగా నటించిన '24 కిస్సెస్' సినిమా ఫస్ట్ లుక్ ఇంటర్నేషనల్ కిస్సింగ్ డే (జులై 6) సందర్బంగా విడుదల చేసారు.  ఈ చిత్ర టీజర్ రేపు విడుదల చెయ్యబోతున్నారు. 'మిణుగురులు' చిత్ర దర్శకుడు అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. 'మిణుగురులు' చిత్రం విమర్శకుల ప్రసంశలు పొందడమే కాకుండా పలు అవార్డ్స్ సొంతం చేసుకుంది.
"నీకో సగం నాకో సగం ఈ ఉత్సవం" ట్యాగ్ లైన్ తో ఉన్న ఈ పోస్టర్ అంచనాలను పెంచింది. కొత్త కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా యువతను అలరించబోతోంది. సిల్లీమొంక్స్ ఎంటర్టైన్మెంట్స్, రెస్పెక్ట్ క్రియేషన్స్ బ్యానర్స్ '24 కిస్సెస్' సినిమాను నిర్మించాయి. నటీనటులు:
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్, అదితి మ్యాక, రావు రమేష్, నరేష్
 
 
 
హెబ్బా పటేల్, అరుణ్ అదిత్ '24 కిస్సెస్' ఫస్ట్ లుక్.