విత్తనాల షాపుల్లో మంత్రి తనిఖీలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విత్తనాల షాపుల్లో మంత్రి తనిఖీలు

గుంటూరు,జూలై 7, (way2newstv.com) 
గుంటూరు పట్నంబజార్ లో ఆంజనేయ ట్రేడర్స్, రాఘవేంద్ర ఎంటర్ ప్రైజెస్ విత్తనాల షాపులలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఆ దుకాణాలలో స్టాక్ రిపోర్ట్ తనిఖీ, ఎరువుల బరువును తనిఖీ చేశారు. రూ 500 రూ తో మైక్రో నుట్రెంట్ ప్యాకెట్ కొనుగోలు చేసి లాబ్ కి పంపిస్తామన్నారు. ప్రభుత్వ అనుమతి పొందిన ఉత్పత్తులు  అమ్ముతున్నారా లేదా అని విచారించారు. అక్కడ కాటా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. మరో దుకాణం  సూర్య చంద్ర సీడ్స్  షాపు లో బీజీ-3 పత్తి విత్తనాలు నకిలీ వి గా గుర్తించారు. మంత్రి మాట్లాడుతూ నకిలీ ఉత్పత్తుల వల్ల రైతాంగం, పర్యావరణ దెబ్బతింటుంది. నకిలి విత్తానాలు వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ ఏడాది 8754క్వింటాలు విత్తనాలు సీజ్ చేశాం. గుంటూరు లో 10కేసులు పెట్టాం. నకిలీ విత్తనాలు, ఎరువుల పై ఉపేక్షించేది లేదని అయన హెచ్చరించారు.
 
 
 
విత్తనాల షాపుల్లో మంత్రి తనిఖీలు