పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన

మహబూబ్ నగర్  జూలై 7  (way2newstv.com)   
మహబూబ్నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ శనివారం పర్యటించారు.  ఇందులో భాగంగా రూ.30 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. దివిటిపల్లిలో ఐటీ పారిశ్రామిక కారిడార్కు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్  పాల్గొన్నారు.పెద్ద చెరువు మినీ ట్యాంక్‌బండ్‌ పనులను మంత్రులు కేటీఆర్‌, లక్ష్మారెడ్డిలు పరిశీలించారు. కొద్దిసేపు మంత్రులు బోటులో షికారు చేశారు.  ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు. పాలమూరు పౌరుషాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలకు చూపించాలని చెప్పారు. పాలమూరు జిల్లా వలసలకు కాంగ్రెస్ నేతలే కారణమని మంత్రి ధ్వజమెత్తారు. దేశాన్ని కబంధ హస్తాల్లో ఉంచుకున్నది కాంగ్రెస్ నేతలే అని మండిపడ్డారు.  రాష్ట్రంలో మంచి పని చేద్దామంటే.. కాంగ్రెస్ నేతలు అడ్డుకుంటున్నారని అరోపించారు.  పార్టీలతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుంటే.. కొందరు విమర్శించడం సరికాదన్నారు.  ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తమ పునాదులు కదులుతాయనే కాంగ్రెస్ నేతలు చిల్లర మల్లర కేసులు పెడుతున్నారని తెలిపారు. జిల్లాలో చేనేత కార్మికులకు రూ. 25 కోట్ల వ్యయంతో హ్యాండ్లూమ్ ఏర్పాటు చేస్తున్నామని కేటీఆర్ ప్రకటించారు. మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మహబూబ్నగర్ జిల్లాలో ఐటీ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా జిల్లా యువతకు ఉపాధి లభిస్తుందన్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో జడ్చర్ల పరిసర ప్రాంతాల ప్రజలకు ఉపాధి పనులు లభిస్తాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు కంటి తుడుపుగానే అభివృద్ధి కార్యక్రమాలు చేశాయని విమర్శించారు.



పాలమూరులో మంత్రి కేటీఆర్ పర్యటన