డీఎస్ ను దూరం పెడుతున్న కేసీఆర్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డీఎస్ ను దూరం పెడుతున్న కేసీఆర్

హైద్రాబాద్, జూలై 3, (way2newstv.com)
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ ను కలిసేందుకు ఎందుకు ఇష్టపడటం లేదు. ఆయనకు గత నాలుగు రోజుల నుంచి అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదు. ముఖ్యమైన నేతలను నిత్యం కలుస్తూనే ఉన్న కేసీఆర్ డి.శ్రీనివాస్ ను మాత్రం కలిసేందుకు అయిష్టత వ్యక్తం చేస్తున్నారు. డీఎస్ ను కలిస్తే ఆయన చెప్పే వివరణకు తలొగ్గాల్సి వస్తుందనా? అలా డీఎస్ కు సానుకూలంగా వ్యవహరిస్తే కుమార్తె కవితకు కోపం వస్తుందనా? ఇలా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎస్ విషయాన్ని పక్కన పెట్టేసినట్లే కన్పిస్తోంది. ఇంతకూ డీఎస్ ను సస్పెండ్ చేసినట్లా? చేయనట్లా?నాలుగు రోజుల క్రితం కేసీఆర్ కుమార్తె కవిత సారథ్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నిజామాబాద్ జిల్లా ప్రతినిధులందరూ కలసి ఏకంగా తీర్మానం చేసి ముఖ్యమంత్రి కి పంపారు.
 
 
 
డీఎస్ ను దూరం పెడుతున్న కేసీఆర్
 
 డి.శ్రీనివాస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, పార్టీకి తీవ్రం నష్టం కలిగిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని, వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కవిత ఆధ్వర్యంలో నేతలందరూ కేసీఆర్ కు తీర్మానం చేసి పంపారు. దీంతో డీఎస్ ను వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారని భావించారు. కాని అలాంటిదేమీ ఇంతవరకూ జరగకపోగా, ఆ విషయాన్నే మర్చిపోయినట్లు వ్యవహరిస్తున్నారు గులాబీ పార్టీ నేతలు.ముఖ్యమంత్రి కేసీఆర్ కు డి.శ్రీనివాస్ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. ఆయన సీనియర్ నేత కావడంతో పాటు 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేలా ఒప్పించింది డీఎస్ అనేనని ఆయన ఇప్పటీకి అంగీకరిస్తారు. అప్పట్లో వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వ్యతిరేకించినా అధిష్టానంతో పోరాడి ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ మంత్రిపదవులను టీఆర్ఎస్ దక్కించుకుంది. అందువల్లనే కేసీఆర్ కేంద్రమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం 36 పార్టీల మద్దతు కూడగట్టే అవకాశం చిక్కిందంటారు. అందుకే డీఎస్ పార్టీలో చేరగానే గౌరవ సలహాదారు పదవి ఇవ్వడమే కాకుండా, వెంటనే రాజ్యసభ పదవి కూడా కేసీఆర్ ఇచ్చారు.వాస్తవానికి డీఎస్ తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతున్నారు. తాను ఢిల్లీలో కాంగ్రెస్ నేతలను కలసినట్లు చేస్తున్న ప్రచారం అవాస్తవమంటున్నారు. కావాలంటే విచారణ జరిపించుకోవచ్చని కూడా సవాల్ విసిరారు. తనను పార్టీ నుంచి తొలగించాలా? వద్దా? అన్నది కేసీఆర్ చేతుల్లోనే ఉందని, ఆయన నిర్ణయానికే వదిలేస్తున్నట్లు ప్రకటించారు. అయితే డీఎస్ ను వదులకోవడం కేసీఆర్ కు ఇష్టం లేదు. సీనియర్ నేతగానే కాకుండా, ఆయన బలమైన సామాజికవర్గం కూడా దూరమవుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. డీఎస్ తనను కలిస్తే ఆయన చెప్పే వివరణకు సమాధాన పడాల్సి వస్తుందేమోనని ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదన్న టాక్ కూడా ఉంది. మొత్తం మీద డీఎస్ వ్యవహారాన్ని ఇప్పుడు నిజామాబాద్ జిల్లా నేతలు కూడా పట్టించుకోవడం లేదు.