బీజేపీతోనే నితీష్ కుమార్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీజేపీతోనే నితీష్ కుమార్...

పాట్నా జూలై 9 (way2newstv.com)
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సరైన నిర్ణయం తీసుకున్నారా? బీజేపీతో కొనసాగాలని ఆయన తీసుకున్న నిర్ణయం కరెక్టేనా? ఇదే ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కాని నితీష్ నిర్ణయం మాత్రం బీజేపీకి పండగలా ఉంది. అయితే ఒక వార్తాసంస్థ కథనం ప్రకారం ఇది నిజమేనని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనతాదళ్ యు లు కలసి పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మేరకు సీట్ల పంపకంపై కూడా లోతైన చర్చ జరిగినట్లు చెబుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీతో కలసి వెళ్లాలని నితీష్ నిర్ణయించారు.బీజేపీపై గత కొంతకాలంగా బీహార్ ముఖ్యమంత్రి నితీష‌ కుమార్ అసంతృప్తిగా ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. నోట్ల రద్దు విషయంపై కూడా ఆయన కేంద్ర ప్రభుత్వంపై నెగిటివ్ కామెంట్స్ చేశారు. బీహార్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వంపై ఇటీవల వత్తిడి తెస్తున్నారు. ఈ పరిణామాలన్నీ ఎన్డీఏ నుంచి బయటకు రావడానికేనని విశ్లేషకులు సయితం అంచనా వేశారు. జనతాదళ్ యు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికలతో పాటు, రానున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సయితం ఎన్డీఏతో కలసి పోటీ చేయాలని నిర్ణయాన్ని ఈ సమావేశంలో తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఒకరకంగా కష్టకాలంలో ఉన్న కమలనాధులకు అండ దొరికినట్లే. 2019లో జరిగే లోక సభ ఎన్నికల్లో జేడీయూకు 17 సీట్లు, మిగిలిన సీట్లు ఎన్డీఏ మిత్ర పక్షాలకు ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే 2020 లో జిరిగే అసెంబ్లీ ఎన్నికల్లో సయితం ఎన్డీఏతో కలసి వెళ్లాలని నితీష్ తీసుకున్న నిర్ణయం ఆయనకు కలసి వస్తుందో లేదో తెలియదు కాని, ప్రస్తుతానికి కమలనాధులకు మాత్రం బాగా కలసివచ్చినట్లే.
 
 
 
బీజేపీతోనే నితీష్ కుమార్...