పవన్ కోసం ఒక్కటవుతున్న మెగా ఫ్యామలీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పవన్ కోసం ఒక్కటవుతున్న మెగా ఫ్యామలీ

హైద్రాబాద్, జూలై 9 (way2newstv.com)
ప్రజారాజ్యం ఒక ఫెయిల్యూర్ స్టోరీ. దానినుంచి పాఠాలు నేర్చుకున్న పవన్ కళ్యాణ్ జనసేన ను గత ఎన్నికల ముందు ప్రకటించి బిజెపి టిడిపిలకు మద్దత్తు ఇచ్చి ప్రచారం చేసి సరిపెట్టారు. నిదానమే ప్రధానమన్న ఆలోచన అన్న వేసిన తప్పటడుగులు తమ్ముడిగా వేసేందుకు పవన్ సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే పార్టీ నిర్మాణం మొదలు అన్నిటా తానై వ్యవహరిస్తూ ఏ ఒక్కరిని నమ్ముకుని ముందుకు వెళ్లడం లేదు ఆయన. ఆచితూచి అడుగులు వేస్తూ 2024 లో అధికారం లక్ష్యమని ప్రకటించి ఆ తరువాత అలా ప్రకటిస్తే ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారు రారని తెలిసి గట్టి పోరాటం కోసం కవాతు మొదలు పెట్టారు. ఈలోగా పవన్ ను తొక్కేందుకు తెరవెనుక జరిగిన కుట్రలతో కొంత గ్యాప్ నడుస్తున్న మెగాస్టార్ కుటుంబానికి కోపం వచ్చింది. దాంతో మెగా కుటుంబం గంపగుత్తగా పవర్ స్టార్ జనసేనకు జై కొట్టేశారు. వారు ఇలా మారడానికి వెనుకనుంచి చక్రం తిప్పింది రాయబారం సాగించింది మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు గా ప్రచారం సాగుతుంది. తమ్ముడికి అన్నగా సాయం అందిస్తున్నారు నాగబాబు.
 
 
 
 పవన్ కోసం ఒక్కటవుతున్న మెగా ఫ్యామలీ
 
చాలా కాలంగా నాగబాబు చేస్తున్న ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి. శ్రీ రెడ్డి, కత్తి మహేష్, రాంగోపాల్ వర్మ ఇలాంటి వారిని తెరపైకి తెచ్చి పవన్ ను ఒంటరిని చేసి రెచ్చగొట్టాలని కొందరు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలంటే మెగా కుటుంబం అండగా నిలవాలని డిసైడ్ అయిపొయింది. ఇంతవేగంగా మెగా కుటుంబం పవర్ స్టార్ వెంట నడవడం వెనుక విమర్శకుల పుణ్యమనే చెప్పాలి. చిరంజీవి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో విలీనం చేశాకా ఆయనతో రాజకీయంగా విభేదించారు పవన్ కళ్యాణ్. నాడు పార్టీ పెట్టిన తరువాత నుంచి విలీనం వరకు జరిగిన సంఘటనలను సోదరులంతా ప్రత్యక్షంగా గుర్తుపెట్టుకుని వున్నారు. అప్పటి పార్టీలో అల్లు అరవింద్ తరువాత నాగబాబు కూడా కీలక పాత్ర వహించారు. తన అనుభవాన్ని ఈసారి తమ్ముడికి అందించాలని బ్యాక్ డోర్ ఆఫీస్ వర్క్ మెగా ఫ్యామిలీ నడిపేలా నాగబాబు స్కెచ్ గీసినట్లు తెలుస్తుంది. ఏపీలో వున్న ప్రధాన ప్రాంతీయ పార్టీలు తెలంగాణ లో తెరాస, కేంద్రంలో కాంగ్రెస్ కుటుంబ సభ్యుల సహకారంతోనే సాగుతున్న తీరును కాపీ పేస్ట్ చేసుకుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా జనసేన అధికారంలోకి వచ్చి తీరుతుందని మెగా ఫ్యామిలీ అంచనాగా ఉందంటున్నారు.నాగబాబు ఆదేశాలతో తెలుగు రాష్ట్రాల్లో వున్న మెగాస్టార్ అభిమాన సంఘాల సమావేశానికి రంగం సిద్ధమైంది. వీరంతా కాంగ్రెస్ కి రాజీనామా చేసి జనసేన తీర్ధం పుచ్చుకుని ఇక ఓపెన్ గానే పవన్ కి అండగా నిలవాలన్న క్లియర్ కట్ ఆదేశాలు మెగా కుటుంబం నుంచి వచ్చేశాయి. దాంతో చిరంజీవి అభిమాన సంఘాల అధ్యక్షుడు రవణం స్వామినాయుడు యాక్టివ్ అయిపోయారు. ఆయన వివిధ జిల్లాలలోని ప్రధాన సంఘాలన్నిటితో భేటీ నిర్వహించే ప్రక్రియ మొదలు పెట్టేశారు. తాజాగా జరగబోయే ఆ సమావేశంలో కీలక నిర్ణయాలనే మెగా ఫ్యాన్స్ ప్రకటించనున్నారు. ఇప్పటికే చిరంజీవి కి పార్టీ పెట్టినప్పుడు మద్దత్తుగా నిలిచిన అభిమాన సంఘాల్లో ముఖ్య నేతలు కార్యకర్తలు జనసేన పని మొదలు పెట్టినప్పటినుంచి పవన్ వెనుకే అనధికారికంగా తిరుగుతున్నారు. ఇప్పుడు స్వామినాయుడు సమావేశం నిర్వహించి బాహాటంగా పవన్ కి అండగా ఉంటామని పిలుపు ఇస్తే అధికారికంగా జనసేన జండా పట్టుకు తిరగనున్నారు. ఇదంతా బాగానే వున్నా గంపెడాశలతో చిరంజీవిని ఆయన పార్టీని కలిపేసుకున్న కాంగ్రెస్ పార్టీ తాజా పరిణామాలను ఎలా అర్ధం చేసుకుంటుంది ? యాక్టివ్ గా లేనప్పటికీ ఇప్పటికి కాంగ్రెస్ లో వున్న చిరంజీవి ఎలా స్పందిస్తారు అన్నది ఇప్పడు హాట్ టాపిక్ కానుంది