ఆ మూడు పార్టీలు ఒకటే : ఉత్తమ్ కుమార్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఆ మూడు పార్టీలు ఒకటే : ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైదారాబాద్, జూలై 3, (way2newstv.com)

బీజేపీ  టీఆరెస్ ల మధ్య రహస్య ఒప్పందం ఉంది. టీఆరెస్ కు ఓటేసిన ఎంఐఎం కు ఓటేసిన బిజెపికి వేసినట్లే. ఎంఐఎం బీజేపీ టీఆరెస్ మూడు ఒక్కటే. బిజెపి చెప్పినట్లు ఎంఐఎం నడుచుకుంటుందని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ఆరు. సోమవారం నాడు గాంధీ భవన్ లో అయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ పోటీ చేయమన్నందుకే గతంలో యుపి ,మహారాష్ట్రలో ఎంఐఎం పోటీచేసింది. పాత బస్తి లో ఈసారి ఎంఐఎం ను ఓడిస్తామన్నారు. మైనార్టీలు మోడీని ఓడించాలంటే కాంగ్రెస్ కు మద్దతు పలకాలి. మైనార్టీ సంక్షేమం చేసి చూపింది కాంగ్రెస్. 12శాతం రిజర్వేషన్ లు ఎందుకు అమలు చేయడం లేదో కేసీఆర్ చేప్పాలని అయన అన్నారు. నాలుగు నెలలు అని చెప్పి నాలుగు ఏళ్ళు గడిచి పోయాయి. ముస్లిం రిజర్వేషన్ లను మోడీ అమలు చేస్తారని కేసీఆర్ చెప్పింది నిజం కాదా  అని అయన ప్రశ్నించారు. మోడీ -కేసీఆర్ ల మధ్య జరిగిన ఒప్పందం ఏమిటో చెప్పాలి. ఆలేరు ఎన్ కౌంటర్ లో నలుగు రు మైనార్టీలు చనిపోయి నాలుగేళ్లయింది ..ఎందుకు మాట్లాడరని అన్నారు. ఉర్దూ భాష గురుంచి కేసీఆర్ చెప్పింది ఏంటి ..ఇప్పుడు జరుగుతుంది ఏమిటని అయన నిలదీసారు. ఉర్దూ టీచర్ల నియామకాలను కెసిఆర్ మరిచారు. మైనారిటీ లు 12శాతం ఉంటె బడ్జెట్లో ఆ వర్గాలకు కేటాయించిన నిధులు 0.6 మాత్రమే. పెళ్ళై పిల్లలు పుట్టినా షాదీ ముబారక్ డబ్బులు ప్రభుత్వం నుండి అందడం లేదని అయన ఆరోపిపంచారు. 
ఆ మూడు పార్టీలు ఒకటే : ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ మోసగాడు చీటర్ అని వ్యాఖ్యానించారు. కేటీఆర్ జానెడు ఉండు..పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. సోనియా కాళ్లదగ్గర నించున్నప్పుడు కేటీఆర్ గుర్తుకు లేదా అని అన్నారు. బిడ్డ కేటీఆర్ నోరు జాగ్రత్త గా పెట్టుకో. కేటీఆర్ సిరిసిల్ల లో, కవిత నిజసమాబాద్ లో ఓడిపోవడం ఖాయమని అన్నారు.