రసాభాసగా కాంగ్రెస్ సమావేశం అజారుద్దీన్ పై మండిపడ్డ అంజన్ కుమార్ యాదవ్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రసాభాసగా కాంగ్రెస్ సమావేశం అజారుద్దీన్ పై మండిపడ్డ అంజన్ కుమార్ యాదవ్

హైదరాబాద్,జూలై 17 (way2newstv.com)
సోమవారం నాడు జరిగిన హైద్రాబాద్ నగర కాంగ్రెస్ సమావేశం రసాభాసగా మారింది. . సికిందరాబాద్ పార్లమెంటు స్థానంనుంచి ఎవరుపోటీ చేయాలనే అంశంపై సమావేశంలో రభస జరిగింది. మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సికిందరాబాద్ స్థానంనుంచి తాను పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే సికిందరాబాద్ స్థానంనుంచి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు  అంజన్ కుమార్ యాదవ్ పోటీ చేస్తారని, ఆ స్థానం ఆయనదేనని సర్వే సత్యనారాయణ అన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా అంజన్ పార్లమెంటును వదలడని అన్నారు.అంజన్ మాట్లాడుతూ అజారుద్దీన్ కు శక్తి సామర్ధ్యాలు ఉంటే హైద్రాబాద్ పార్లమెంటు నుండీ పోటీ చేయాలని అన్నారు. అంజన్ అనుచరులు అజారుద్దీన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తిని కూడా సభ్యులు పట్టించుకోకుండా రభస సృష్టించారు. టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలోని అన్ని స్థానాల్లో బలమైన అభ్యర్థులను ఎన్నికల బరిలోకి దింపుతామని చెప్పారు. హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ ప్రక్షాళనకు అందరూ సహకరించాలని ఆయన కోరారు. పని చేసే ఉత్సాహం ఉన్నవారికే కమిటీలో ప్రాధాన్యత ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
 
 
 
రసాభాసగా కాంగ్రెస్ సమావేశం 
అజారుద్దీన్ పై మండిపడ్డ అంజన్ కుమార్ యాదవ్