పరిస్థితి దుర్మార్గంగా వుంది : కన్నా లక్ష్మీనారాయణ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరిస్థితి దుర్మార్గంగా వుంది : కన్నా లక్ష్మీనారాయణ

న్యూఢిల్లీ, జూలై 17 (way2newstv.com)
పార్లమెంటు సమావేశాల్లో గొడవ చేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారని ఎపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టడం కేవలం డ్రామా అని ఆయన చెప్పారు. ఎపిలో పాలన దారుణంగా ఉందని, ఇలాంటి పాలనను ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. బిజెపి కార్యకర్తలపై కావాలనే కేసులు పెడుతున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో తెలుగుదేశం నేతలవల్ల అధికారులు, ఇతరులు తమ భావాలు చెప్పుకోలేకపోతున్నారని అయన వ్యాఖ్యానించారు. మహిళ అధికారులకు రక్షణ లేదు. దోపిడిపై ఉన్న శ్రద్ధ ... రాష్ట్రప్రజాలపై తెలుగు దేశానికి లేదని అన్నారు. పోలీస్ లను ఉపయోగించి వేధిస్తున్నారు. నా ఫోన్ టాపింగ్ చేస్తున్నారు. ఈ విషయాన్నీ  కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ దృష్టికి తీసుకొచ్చాను. అమిత్ షాపై దాడి చేశారు, నేను ఉన్న గెస్ట్ హౌస్ పై, కవలిలో, ఒంగోలు లోను దాడి చేశారు. తిరిగి మాపై కేస్ లు పెడుతున్నారని అన్నారు. నా మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. వాటిపై విచారణ చెయ్యమని కేంద్రాన్ని కోరాను. ఎవరు ప్రశ్నించినా కేస్ లు పెడుతున్నారు. వేధిస్తున్నారు. ప్రతిపక్షాల సమావేశాలకు వెళ్లినా ప్రజలపై కేస్ లు పెడుతున్నారు. అంత దుర్మార్గంగా ఉంది  పరిస్థితి అని అరోపించారు. తెలుగుదేశం ఎంపీ లకు శివసేన నేత ఉద్ధవ్ థాకరే కనీసం అపాయింట్ మెంట్   ఇవ్వలేదు. వీరి అరాచకాలు, అసత్య ప్రచారాలు అందరికి తెలుసు. అందుకే అపాయింట్ మెంట్ ఇవ్వలేదు.కడప స్టీల్ ప్లాంట్ కోసం తెలుగు దేశం డ్రామాలు ఆడింది. అలాంటి డ్రామాలు పార్లమెంట్ లో వద్దు. ఇకనైనా డ్రామాలు ఆపాలని అన్నారు. ఆంధ్రాలో ఎవరితో పొత్తులు లేవు. ఒంటరిగానే వెళ్ళడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
 
 
 
పరిస్థితి దుర్మార్గంగా వుంది : కన్నా లక్ష్మీనారాయణ