దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌

(way2newstv.com)
తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో `సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు` వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించిన మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నాంది ప‌లికిన నిర్మాత దిల్‌రాజు... నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో `ఎఫ్ 2`(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇది కాకుండా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీకారం చుడుతున్నారు స్టార్ నిర్మాత దిల్‌రాజు. `అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, జెంటిల్‌మన్‌, స‌మ్మోహ‌నం` వంటి డిఫ‌రెంట్‌,  సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. ఏక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనుంది ఈ చిత్రం.  త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివ‌రాల‌ను  చిత్ర‌యూనిట్ తెలియ‌జేస్తుంది. దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌