జిల్లాల విమానయాన సౌకర్యాలపై సీఎస్ సమీక్ష - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జిల్లాల విమానయాన సౌకర్యాలపై సీఎస్ సమీక్ష

హైదరాబాద్, జూలై 12, (way2newstv.com)
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఏయిర్ కనెక్టివిటీ కి సంబంధించి క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, నెలరోజుల్లోగా ఏవియేషన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్  ప్రోగ్రామ్ కు సంబంధించి ముసాయిదా నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఆదేశించారు.
 
 
 
 జిల్లాల విమానయాన సౌకర్యాలపై సీఎస్ సమీక్ష
 
 గురువారం సచివాలయంలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమి మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది.  ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఏవియేషన్ అకాడమీ  సెక్రెటరీ కెప్టెన్ ఎస్. ఎన్. రెడ్డి లతోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సి.యస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు ఏయిర్ స్క్రిప్ట్ లకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ను వినియోగించుకోవడం తో పాటు భవిష్యత్తులో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై నివేదిక రూపొందించాలన్నారు. ఏవియేషన్ అకాడమీ వివిధ విమానయాన సంస్థలకు శిక్షణనిచ్చే స్వయంసమృద్ధి సాధించాలని ఆయన అభిలషించారు. ఏవియేషన్ అకాడమీ ద్వారా ఎంఎస్సీ 5 సంవత్సరాల ఏవియేషన్ కోర్సు ద్వారా వంద శాతం ఉద్యోగాలు పొందుతున్నారని, ఏఎంఈ  కోర్సు ద్వారా మంచి  ఉద్యోగాలు లభిస్తున్నాయని తెలుపుతూ విమానయాన రంగంలో విదేశాలలోను తెలంగాణ యువత మరిన్ని ఉద్యోగాలు పొందేలా కొత్త కోర్సులను ప్రారంభించాలన్నారు. అకాడమీ ద్వారా ఫైలెట్ ట్రైనింగ్ శిక్షణ పొందిన వారిలో 75 నుండి 80 శాతం ఉద్యోగాలు పొందుతున్నారని శిక్షణలో తెలంగాణ ఏవియేషన్ అకాడమీ దేశంలో మంచి గుర్తింపు పొందిందని తెలిపారు. ఇండిగో ఎయిర్ లైన్స్ క్యాడెర్ పైలెట్ ట్రైనింగ్ కోసం ఏవియేషన్ అకాడమీ తో ఒప్పందం కుదుర్చుకుందని అధికారులు వివరించారు. ఆచరణాత్మక జ్ఞానం కోసం ఏయిర్ ఇండియాతోను ఒప్పందం చేసుకున్నామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏవియేషన్ రంగంలో వచ్చే అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అకాడమీ తగు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు.