జోరుగా కొనసాగుతున్న భీమా సర్వే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జోరుగా కొనసాగుతున్న భీమా సర్వే

నిజామాబాద్, జూలై 27, (way2newstv.com)
సీఎం కేసీఆర్ రైతు కుటుంబాలను ఆదుకునేందుకు ప్రవేశపెట్టిన రైతుబీమా మరికొద్దిరోజుల్లో పూర్తికానుంది. ఇదే పనిలో నెలరోజులకు పైగా నిమగ్నమై ఉన్న అధికారులు లక్ష్యానికి చేరువయ్యారు.వ్యవసాయ అధికారులు జిల్లాలో చేపట్టిన రైతు బీమా సర్వే జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యం మేరకు ఇప్పటికీ 85 శాతానికిపైగా పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన విజయవంతమైన తర్వాత రైతుబంధు పథకాన్ని అమలు చేశారు. ఇందులో భాగంగా జిల్లాలో 1.37 లక్షల మంది రైతులు ఉన్నట్లు వ్యవసాయశాఖ తేల్చింది. ఇటీవలే రైతులందరికీ పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ముందస్తు పెట్టుబడి సాయం కింద ఎకరాకు రూ. 4 వేల చొప్పున అందజేయగా ప్రక్రియ కొనసాగుతోంది. 
 
 
 
జోరుగా కొనసాగుతున్న  భీమా సర్వే
 
ఈ క్రమంలో ప్రభుత్వం అన్నదాత కుటుంబ సంక్షేమం కోసం రైతు బీమా ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. రైతు ప్రమాదవశాత్తు చనిపోయినా, సహజ మరణమైనా ఆ కుటుంబానికి రూ. 5 లక్షల బీమా వర్తించేలా ప్రణాళికను రూపొందించింది. ఈ మేర కు ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అర్హులైన రైతుల వివరాలు సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో రంగంలోకి దిగిన వ్యవసాయశాఖ నెలరోజులుగా రైతుబీమా సర్వే నిర్వహిస్తోంది. జిల్లాలో 13 మండలాలు, 193 గ్రామాల్లో సర్వే జోరుగా కొనసాగుతోంది. జిల్లా వ్యవసాయ అధికారి వీరునాయక్ ఆధ్వర్యంలో ముగ్గురు ఏడీఏలు, 11 మంది ఏఓలు, 61 మంది ఏఈఓలు సర్వేలో పాల్గొంటున్నారు.  జిల్లా వ్యాప్తంగా 1.07 లక్షల మంది రైతుల సర్వేకు ఆదేశాలు రాగా ఇప్పటికే లక్ష మందిని అధికారులు కలిశారు. ఇందులో 88 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించి వారి పూర్తి వివరాలు ఆన్‌లైన్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మిగిలిన రైతుల వివరాలు సేకరించాల్సి ఉండగా కొద్ది రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుబీమా సర్వే కొనసాగుతుండగా జిల్లా నాలుగో స్థానంలో దూసుకెళ్తున్నట్లు తెలిపారు. అదే విధంగా ఉమ్మడి జిల్లాలో మహబూబాబాద్ మొదటి స్థానంలో ఉండగా జనగామ రెండో స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు.ఆయా మండలాలు, గ్రామాల్లోని రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో ప్రతీ రైతు ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పట్టాదార్ పాస్‌పుస్తకాలు, ఆధార్ కార్డ్ ఆధారంగా రైతుల పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. 18 నుంచి 59 ఏళ్లలోపు వయసు గల రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించి ఫారాలు నింపుతున్నారు. ఆ తర్వాత అర్హులను గుర్తించి వారి వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. జిల్లాలో రైతు బీమా సర్వేలో భాగంగా 1.07 లక్షల మంది రైతులకు గానూ 1.03 లక్షల మందిని వ్యవసాయశాఖ అధికారులు కలిశారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 88 వేల మంది రైతులను అర్హులుగా గుర్తించినట్లు చెబుతున్నారు. వీరి పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసినట్లు కూడా పేర్కొంటున్నారు. మరో వారం రోజుల్లో మిగిలిన రైతులను కలిసి రైతుబీమా ప్రక్రియను ముగించనున్నట్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైతుబీమా సర్వే ప్రారంభమైన క్రమంలో ఈనెల 10వ తేదీ వరకు పూర్తి చేయాల ని ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలం దృష్ట్యా రైతులు సాగు పనుల్లో బిజీ అయినందున 20వ తేదీ వరకు గడువు విధించారు. అయినప్పటికీ కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నందున పూర్తి చేయలేకపోయామని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు పెట్టుబడి సాయం పొంది స్థానికంగా ఉండని వాళ్ల జాబితాను సేకరించి గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రదర్శించినట్లు తెలిపారు. ఆ జాబి తా ఆధారంగా రైతులు స్పందించి సర్వేకు సహకరిస్తారనే ఉద్దేశంతో చర్య లు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఏదీ ఏమైనా మరో వారం రోజుల్లో సర్వేను పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు