జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ పై మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు

తిరుపతి, జూలై 24, (way2newstv.com)
కేంద్రంతో పోరాడలేక, టీడీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి, రాష్ట్రంలోని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడానికే వైసీపీ బంద్ చేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ప్రధాని మోదీ అయితే, చంద్రబాబు ని విమర్శించడమే లక్ష్యంగా ఈ బంద్ పాటిస్తున్నారన్నరు. తిరుపతి అలిపిరి డిపోలో తిరుమల కి నూతనంగా 35 బస్సులను మంత్రులు అచ్చెన్నాయుడు, అమర్నాధ్ రెడ్డి , ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యా, ఎమ్మెల్యే సుగుణమ్మ, జడ్పీ చైర్మన్ గీర్వాని చంద్రప్రకాష్ , జిల్లా అధ్యక్షులు పులివర్తి నాని ప్రారంభించారు. కార్మికులకు అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం టీడీపీ అని ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య అన్నారు. 
 
 
 
జగన్ పై  మంత్రి అచ్చెన్నాయుడు మండిపాటు
 
మంత్రి అచ్చెన్నాయుడు మీడియా తో మాట్లాడుతూ వైకాపా ప్రజా వ్యతిరేక నిర్ణయంతో ఇవాళ బంద్ ఫెయిల్ అయిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తో పోరాటం చేయాల్సింది పోయి , కేసులకు భయపడి మోదీతో లోపాయకారి ఒప్పందంతో ఆంద్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారని అన్నారు.