ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు

హైదరాబాద్, జూలై 24, (way2newstv.com)
తెలంగాణ భవన్లో ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బర్త్ డే వేడుకలు మంగళవారం నాడు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మహమూద్ అలీ కేక్ కట్ చేశారు. వేడుకల్లో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్లు పాల్గొన్నారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా  వివిధ ప్రాంతాలలో  పలు కార్యక్రమాలు చేపట్టారు. తెలంగాణ భవన్లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్ వద్ద రోడ్డుకు ఇరువైపులా మంత్రులు మొక్కలు నాటారు. నిజమాబాద్ ఎంపీ కవిత మంత్రి కేటీఆర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఎంపీ కవిత ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపారు.కేటీఆర్ కు  ఏపీ మంత్రి నారా లోకేష్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదినం రోజున మీ ప్రతిక్షణం ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్  చేశారు.  కేటీఆర్కు ట్విట్టర్ ద్వారా టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కుడా  జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. దీంతో విషెస్ చెప్పిన ఉత్తమ్కుమార్రెడ్డికి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
 
 
 
ఘనంగా కేటీఆర్ బర్త్ డే వేడుకలు