టీఎస్‌-ఐపాస్‌తో తెలంగాణ పారిశ్రామికాభివ్ర‌ద్ధి వేగ‌వంతం పారిశ్రామిక ప్ర‌గ‌తి కొత్త పుంత‌లు సింగిల్‌విండో విత్ అవుట్ గ్రిల్స్‌తో పారిశ్రామిక‌దిగ్గ‌జాల చూపు రాష్ట్రం వైపు.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీఎస్‌-ఐపాస్‌తో తెలంగాణ పారిశ్రామికాభివ్ర‌ద్ధి వేగ‌వంతం పారిశ్రామిక ప్ర‌గ‌తి కొత్త పుంత‌లు సింగిల్‌విండో విత్ అవుట్ గ్రిల్స్‌తో పారిశ్రామిక‌దిగ్గ‌జాల చూపు రాష్ట్రం వైపు..

హైదరాబాద్ జూలై 12 (way2newstv.com)
సుల‌భ‌త‌ర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌) ర్యాంకింగ్‌లో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో నిలిచినండున సర్వత్రా  హర్షం  వ్యక్త మవుతుంది. వ‌రుస‌గా రెండో సంవంత్స‌రం ఈవోడీబీలో 98.33 శాతం మార్కుల‌తో తెలంగాణ  స‌త్తా చాట‌డం ప్ర‌శంస‌నీయ‌మ‌ని, తాజా ర్యాంకు రాష్ట్రంలో వేగ‌వంత‌మైన పారిశ్రామిక ప్ర‌గ‌తికి నిద‌ర్శ‌న‌మ‌ని చెప్పవచ్చు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ దిశానిర్ధేశం.. ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ కార్య‌ద‌క్ష‌త ఫ‌లితమే సుల‌భ వాణిజ్య ర్యాంకుల్లో తెలంగాణ అగ్ర‌స్థానంలో నిలిచింది. పారిశ్రామిక‌రంగాన్నిప్రొత్స‌హించే క్ర‌మంలో కేంద్ర ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్య శాఖ ప‌రిధిలోని డీఐపీపీ విభాగం సుల‌భ‌త‌ర వాణిజ్యంలో ర్యాంకుల‌ను ప్ర‌క‌టిస్తుంది.ఆస్తుల రిజిస్ట్రేష‌న్‌, త‌నిఖీలు, సింగిల్ విండో విధానం, ప‌రిశ్ర‌మ‌ల‌కు స్థ‌లాల ల‌భ్య‌త‌, కేటాయింపులు, నిర్మాణ అనుమ‌తులు, ప‌ర్యావ‌ర‌ణ అనుమ‌తుల విధానం, ప‌న్నుల చెల్లింపు, ప‌ర్మిట్ల జారీ, పార‌ద‌ర్శ‌క‌త‌, స‌మాచార ల‌భ్య‌త‌, కార్మిక విధానాలు, త‌దిత‌ర 12 అంశాల్లో సంస్క‌ర‌ణ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈవోడీబీ ర్యాంకుల‌ను కేటాయిస్తారు.సుల‌భ‌త‌ర వాణిజ్య ర్యాంకింగ్స్‌లో గ‌తేడాది తెలంగాణ అగ్ర‌స్థానంలో ఉండ‌గా, ఈ ఏడాది కేవ‌లం 0.09 శాతం తేడాతో మొద‌టి స్థానాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కోల్పోఇంది. వ్యాపార సంస్క‌ర‌ణ‌ల కార్యాచ‌ర‌ణ అమ‌లులో 100 శాతం మార్కులతో తెలంగాణ దేశంలో మొద‌టి స్థానాన్ని ద‌క్కించుకోవ‌డం అభినంద‌నీయ‌మ‌ని చెప్పవచ్చు. 
 
 
 
 టీఎస్‌-ఐపాస్‌తో తెలంగాణ పారిశ్రామికాభివ్ర‌ద్ధి వేగ‌వంతం
             పారిశ్రామిక ప్ర‌గ‌తి కొత్త పుంత‌లు
సింగిల్‌విండో విత్ అవుట్ గ్రిల్స్‌తో పారిశ్రామిక‌దిగ్గ‌జాల చూపు రాష్ట్రం వైపు..
 
 
ఈ విభాగంలో ఏపీ 999.73 శాతం మార్కుల‌తో రెండో స్థానంలో నిలిచింది. అయితే సంస్క‌ర‌ణ‌ల అమ‌లుపై వివిధ వ‌ర్గాల నుంచి ఫీడ్ బ్యాక్‌లో తెలంగాణ‌ 83.95 శాతం మార్కులతో ఆంధ్ర‌ప్ర‌దేశ్(86.5 శాతం మార్కులు) కంటే కొంత వెనుక‌బ‌డ‌టం వ‌ల్లే ఈవోడీబీ ర్యాంకింగ్‌లో త్ర‌టిలో మొద‌టి స్థానం చేజార్చుకుంది. ఈవోడీబీలో కొత్త‌గా ఏర్ప‌డిన రెండు తెలుగు రాష్ట్రాలు అగ్ర‌భాగాన ఉంటూ దేశ పారిశ్రామ‌కాభివ్ర‌ద్ధికి దిక్చూచిగా మార‌డం గ‌ర్వ‌కార‌నం. కొత్త‌గా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రాన్నిపారిశ్రామికాభివ్ర‌ద్ధిలో నెంబర్ వ‌న్‌గా నిల‌బెట్టేందుకు సీఎం కేసీఆర్ ఎంతోక్ర‌షి చేస్తున్నారు. ఈ రంగంలో ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన విప్‌ేవాత్మ‌క విధానాల వ‌ల్ల అద్భుత‌మైన ఫ‌లితాలు వ‌స్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌ల‌కు అనుమ‌తులు ఇచ్చే విష‌యంలో స‌ర‌ళీక‌ర‌ణ విధానాల‌ను అవ‌లంభించి నూత‌న పారిశ్రామిక విధానం(టీఎస్‌-ఐపాస్‌)ను అమ‌ల్లోకి తీసుకురావ‌డంతో ప్ర‌పంచ పారిశ్రామిక దిగ్గ‌జాల‌ చూపు తెలంగాణపై ప‌డింది. దేశంలోనే మొద‌టిసారిగా అమ‌ల్లోకి తెచ్చిన టీఎస్‌-ఐపాస్ ద్వారా సింగిల్‌విండో విత్ అవుట్ గ్రిల్స్ ప‌ద్ధ‌తిన కేవ‌లం 15 రోజుల్లో సెల్ఫ్ డిక్ల‌రేష‌న్‌పై ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు అన్నిర‌కాల అనుమ‌తుల‌ను ఇస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్క‌టే.టీఎస్‌-ఐపాస్ రాక‌తో తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో పారిశ్రామిక‌రంగంలో రాష్ట్రంలో మార్చి-2018 వ‌ర‌కు 53 పారిశ్రామిక పార్కులు ఏర్పాట‌య్యాయి.580 ఎక‌రాల‌లో 1132 ప‌రిశ్ర‌మ‌ల‌ను, సంస్థ‌ల‌ను నెల‌కొల్ప‌డం జ‌రిగింది. దీంతో ఈ ప‌రిశ్ర‌మ‌ల ద్వారా రూ.3,815 కోట్ల పెట్టుబ‌డులు రాగా, 32,726 మందికి ప్ర‌త్య‌క్ష్యంగా, 1,45,683 మందికి ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాలు ల‌భించాయి.. సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ల‌కు కార్య‌రూపం ఇచ్చేందుకు ప‌రిశ్ర‌మ‌ల‌శాఖ మంత్రి కేటీఆర్ దేశ‌,విదేశాల్లో ప‌ర్య‌టించి అక్క‌డి పారిశ్రామిక‌వేత్త‌ల‌ను, ఎన్ఆర్ ఐల‌కు టీఎస్‌-ఐపాస్ విశిష్ట‌త‌ల‌ను వివ‌రించి రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబ‌డుల‌ను రాబ‌డుతున్నారు. మంత్రి కేటీఆర్ చొర‌వ ఫ‌లితంగానే రాష్ట్రంలో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు దిగ్గ‌జ సంస్థ‌లు, మేటీ ప‌రిశ్ర‌మ‌లు, బ‌డా పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌స్తున్నారు. టీఎస్‌-ఐపాస్ కింద ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు ఇప్ప‌టికే వేలాది ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి. ఇందులో ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌లు, అర్హ‌త‌ల‌కు అనుగునంగా ప‌రిశ్ర‌మ‌ల‌కు, సంస్థ‌ల‌కు, పారిశ్రామిక‌వేత్త‌ల‌కు టీఎస్‌-ఐఐసీ భూముల‌ను కేటాయిస్తోంది. ఐటీ, ఫార్మా, మెడిక‌ల్ డివైజెస్‌, ఎంఎస్ ఎంఈ, ఆగ్రో, ఫుడ్ ప్రాసెస్‌, ఏరో స్పేస్ రంగంలో ఇప్ప‌టికే తెలంగాణ అగ్ర‌గామిగా ఉంది. ఈ రంగంలో కొత్త ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు పారిశ్రామిక‌వేత్త‌లు పోటీప‌డుతున్నారు.దీంతో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌కు రాష్ట్రంలో భూముల‌కు డిమాండ్ పెరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్య‌వ‌సాయానికి ప‌నికిరాని భూముల‌ను ప‌రిశ్ర‌మ‌ల‌కు ఉప‌యుక్తంగా 1.45 ల‌క్ష‌ల ఎక‌రాలను గుర్తించి టీఎస్ ఐఐసీ రిజ‌ర్వు చేసింది. తెలంగాణ‌లో ఉన్న భౌగోళిక‌, వాతావ‌ర‌ణ‌, శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిస్థితుల అనుకూల‌త‌తో పాటు సీఎం కేసీఆర్ స‌మ‌ర్థ నాయ‌క‌త్వం.. మంత్రి క్ర‌షి,  ప్ర‌త్యేక చొర‌వ కార‌ణంగా అంత‌ర్జాతీయంగా ప్ర‌సిద్ధి గాంచిన గుగూల్‌, యాపిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, ఊబెర్‌, లాంటి ఐటీ సంస్థ‌లు త‌మ కార్యాల‌యాల‌ను హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. రాబోయే కాలంలో ఐటీ, ఫార్మా,  లైఫ్ సైన్సెస్‌, మెడిక‌ల్ డివైజెస్ రంగంలో తెలంగాణ రాష్ట్రం హ‌బ్‌గా మార‌డం ఖాయ‌మ‌ని చెప్పవచ్చు.