నెల్లూరులో కాంగ్రెస్ కు మంచి స్పందన

నెల్లూరు, జూలై 12, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు జిల్లా నాలుగు వ జిల్లా గా పర్యటిస్తున్నాను. కృష్ణా, గుంటూరు , ప్రకాశం జిల్లాలో తో పోలిస్తే నెల్లూరు స్పందన చాలా బాగుంది. క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు సూచనలు, సలహాలు, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చానని కాంగ్రెస్ ఏపీ వ్యవహారాల ఇన్ చార్జీ ఉమెన్ చాందీ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 2014 వరకు రాష్ట్రం కాంగ్రెస్ కి కంచుకోటలాగా ఉండేది. చాలా మంది కాంగ్రెస్ పార్టీని అపార్ధం చేసుకొన్నారు.  రాష్ట్రలో కాంగ్రెస్ ఒక్కటే విభజన చట్టానికి కట్టుబడి ఉంది. మిగిలిన వారంతా ప్రజలను మోసం చేశారని అయన అన్నారు. మన్మోహన్ సింగ్ 5 ఏళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వాలని చెబితే బీజేపీ 10 ఏళ్ళు కావాలని కోరారు. కానీ బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక హోదా హామీని విస్మరించారని అయన విమర్శించారు. ఏపీసీసీ ఛీఫ్  రఘువీరారెడ్డి  మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కాంగ్రెస్ కార్యకర్తలం అందరూ ఎంతో కష్టపడ్డారు. అప్పటి వరకు కాంగ్రెస్ గెలవని నియోజకవర్గం లో 11 సార్లు ఒకే నియోజకవర్గములో ఎమ్మెల్యే గా ఉమెన్ చాందీ గెలిచారు. ఉమెన్ చాందీ రెండు సార్లు కేరళ సీఎం గా పనిచేశారు. ఇలాంటి నాయకుడిని మన రాష్ట్రానికి ఇంచార్జ్ గా రాహుల్ గాంధీ  నియమించారు అంటే కాంగ్రెస్ కి పూర్వ వైభవం వస్తున్నట్లు అర్ధమని అన్నారు. 175 నియోజకవర్గాల లో సమీక్ష నిర్వహించి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకోనున్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఇప్పుడు నెల్లూరు జిల్లలో సమీక్షలు నిర్వహిస్తున్నారని అన్నారు.
 
 
 
నెల్లూరులో కాంగ్రెస్ కు మంచి స్పందన 
Previous Post Next Post