హైదరాబాద్, జూలై 2, (way2newstv.com)
తెలంగాణ మంత్రి కేటీఆర్, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇద్దరూ ఏ మాత్రం తగ్గకుండా మాటల తూటాలు పేల్చుతున్నారు. తాజాగా సోనియాగాంధీ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా ఉత్తమ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణను సోనియాగాంధీ ఇచ్చారన్న నిజాన్ని ఎవరూ కాదనలేరని... కాదన్న వారు మూర్ఖులని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను సోనియా ఇచ్చారంటూ గతంలో మీ తండ్రి చేసిన వ్యాఖ్యలతో మీరు విభేదిస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఇచ్చింది అమ్మా కాదు, బొమ్మా కాదంటూ కేటీఆర్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రాన్ని తాము పోరాడి, సాధించుకున్నామని చెప్పారు. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతల్లో ఆగ్రహాన్ని రగిలించాయి.
కేటీఆర్ కు ఘాటుగా సమాధానం ఇచ్చిన ఉత్తమ్