మరింత దిగజారిన రూపాయి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మరింత దిగజారిన రూపాయి

ముంబై జూలై  21 (way2newstv.com)
రూపాయి విలువ మరింత దిగజారింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ జీవితకాల (ఆల్‌టైమ్) కనిష్టానికి చేరింది. వరుసగా మూడో సెషన్‌లోనూ రూపాయి కుంగిపోయి.. డాలర్‌తో పోలిస్తే 69.12కి చేరింది. అంతర్జాతీయ, దేశీయ పరిణామాలతో పాటు చైనీస్ సెంట్రల్ బ్యాంక్ తమ కరెన్సీ యువాన్ విలువను డాలర్‌తో పోలిస్తే మరో 0.28 శాతం తగ్గించడం రూపాయిపై ప్రభావం చూపింది. ప్రస్తుతం డాలర్‌తో యువాన్ విలువ 6.7943గా ఉంది. అమెరికాతో చైనా వాణిజ్య యుద్ధం ముదరడంతో యువాన్ విలువ ఈ ఏడాది కనిష్టానికి చేరింది. వాణిజ్య యుద్ధంలో పట్టు సాధించడానికి చైనా సెంట్రల్‌ బ్యాంకే ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలు వెలువడ్డాయి. దీంతో భారత్‌తోపాటు పలు ఆసియా దేశాల కరెన్సీలు పతనమయ్యాయి. శుక్రవారం ఉదయం డాలర్‌తో రూపాయి విలువ 69గా మొదలైంది. అయితే యువాన్ విలువ పడిపోగానే రూపాయి కూడా పతనమైంది. గతంలో రూపాయి కనిష్ట విలువ 69.10గా ఉండగా.. ఇప్పుడది 69.12కి చేరింది. రూపాయి విలువ మరింత పతనమయ్యే అవకాశం ఉండటంతో దిగుమతి దారులు డాలర్ల కోసం పోటీ పడ్డారు. అంతకుముందు జూన్‌ 28న రూపాయి రూ.69.10 పైసలతో తొలిసారిగా ఆల్ టైమ్ కనిష్టానికి పతనమైన సంగతి తెలిసిందే. 


మరింత దిగజారిన  రూపాయి