8 న కామినేని ఫ్లై ఓవర్ ప్రారంభం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

8 న కామినేని ఫ్లై ఓవర్ ప్రారంభం

హైదరాబాద్ ఆగష్టు 8 (way2newstv.com)    
 రూ. 49 కోట్ల‌తో కామినేని వ‌ద్ద ఫ్లైఓవ‌ర్ ను బుధవారం నాడు రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కె టి రామ రావు ప్రారంభించనున్నారు.12మీట‌ర్ల వెడ‌ల్పుతో 940మీట‌ర్ల పొడ‌వు గ‌ల  ఫ్లైఓవ‌ర్ నిర్మాణం రికార్డు కాలంలో పూర్తయ్యింది. ప్ర‌స్తుతం ఈ మార్గంలో గంట‌కు 11వేల వాహ‌నాలు ప్ర‌యాణిస్తుండ‌గా 2034నాటికి వీటి సంఖ్య 17వేల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేశారు. కామినేని జంక్ష‌న్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణంపై దాదాపు 90శాతం వాహ‌నదారులు స‌లువుగా ప్ర‌యాణించ‌డానికి అవ‌కాశం ఏర్ప‌డ‌నుంది.ఇటీవల  ఎల్బీన‌గ‌ర్ నియోజక వర్గంలో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో వివిద కాలనీలు, బస్తీలలో అభివృద్ధి పనులు చేపట్టడానికి వచ్చిన ప్రతిపాదనలతో రూ 37.5   కోట్ల వ్యయంతో 110   పనులను మంజూరు చేస్తూ ఆదేశాలు జరీ అయ్యాయి. 
 
 
 
8 న కామినేని ఫ్లై ఓవర్  ప్రారంభం
 
ఈ 110 పనులలో 101  ఇంజనీరింగ్ విభాగానికి సంబందించినవి కాగా మరో 8  పనులు హార్టికల్చర్ విభాగానికి సంబందించినవి ఉన్నాయి. ఈ37 .50  కోట్ల తో మన నగరం పనులను చేపడుతున్నట్లు రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కె టి రామ రావు బుధవారం నాడు ప్రకటించనున్నారు.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో అత్యంత ర‌ద్దీగా ఉండే ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌తో పాటు ప‌రిస‌ర ప్రాంతాల్లో సిగ్న‌ల్ ర‌హిత ర‌హ‌దారుల ఏర్పాటుకు రాష్ట్ర ప్ర‌భుత్వం మంజూరు చేసిన‌ రూ. 448కోట్ల వ్య‌యంతో ఐదు ప్రధాన జంక్ష‌న్ల‌లో అండ‌ర్ పాస్‌లు, గ్రేడ్ స‌ప‌రేట‌ర్లు, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణాల‌ను జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్‌, కామినేని జంక్ష‌న్‌, చింత‌ల‌కుంట జంక్ష‌న్‌, బైరామ‌ల్‌గూడ‌, నాగోల్జంక్ష‌న్ల‌లోపెద్దఎత్తుననిర్మాణాలుకొన‌సాగుతున్నాయి.రూ. 42,74,16,000 వ్య‌తో ఎల్బీన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్ నిర్మాణం, అండ‌ర్‌పాస్‌ల నిర్మాణం ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్ వ‌ద్ద గంట‌కు 15,000 వాహ‌నాలు ప్ర‌యాణిస్తున్నాయి. 2034 సంవ‌త్స‌రం నాటికి వీటి సంఖ్య 22వేల‌కు చేరుతుంద‌ని అంచ‌నా వేశారు. పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందుల‌ను అదిగ‌మించ‌డానికి చేప‌ట్టిన ఈ ఫ్లైఓవ‌ర్‌, అండ‌ర్ పాన్ నిర్మాణం పూర్తితో 90శాతం ట్రాఫిక్ క‌ష్టాలు తీర‌నున్నాయి.*ఎల్బీన‌గ‌ర్ ఫ్లైఓవ‌ర్‌:*  780 మీట‌ర్ల పొడ‌వు, 12మీట‌ర్ల వెడ‌ల్పుతో ఎల్బీన‌గర్ ఎడ‌మ‌వైపు ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు ముమ్మ‌రంగా సాగుతున్నాయి. ఎల్బీన‌గ‌ర్ జంక్ష‌న్ నుండి దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వైపు 147 మీట‌ర్లు, విజ‌య‌వాడ వైపు 213 మీట‌ర్ల పొడ‌వులో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నులు పురోగ‌తిలో ఉన్నాయి.*ల్బీన‌గర్ అండ‌ర్ పాస్‌:*  కామినేని వైపు నుండి నాగార్జున సాగ‌ర్ క్రాస్‌రోడ్స్ జంక్ష‌న్ వైపు సులువుగా వాహ‌నాలు ప్ర‌యాణం చేయ‌డానికి 520మీట‌ర్ల పొడ‌వుతో అండ‌ర్ పాస్ నిర్మాణం ముమ్మ‌రంగా సాగుతోంది. 25.75 మీట‌ర్ల వెడ‌ల్పుతో 72.50 మీట‌ర్ల పొడ‌వు గ‌ల క్లోస్‌డ్ బాక్స్ నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. వీటిలో సాగ‌ర్ రింగ్ రోడ్ వైపు 165.75 మీట‌ర్ల పొడ‌వు, నాగోల్ వైపు 291.75మీట‌ర్ల పొడ‌వులో ఈ అండ‌ర్ పాస్ నిర్మాణం జ‌రుగుతుంది. ఈ అండ‌ర్ పాస్‌ను డిసెంబ‌ర్ మాసంలో ప్రారంభించ‌డానికి ప‌నుల‌ను ముమ్మరంగా నిర్వ‌హిస్తున్నారు.ఎల్బీన‌గ‌ర్ రింగ్‌రోడ్ వ‌ద్ద అత్య‌ధికంగా ఉండే ట్రాఫిక్ అనంత‌రం బైర‌మాల్‌గూడ రింగ్ రోడ్ వ‌ద్ద కూడా అంతే మొత్తంలో  ఉన్న ట్రాఫిక్ ఇబ్బందుల‌ను దూరం చేయ‌డానికి రూ. 38.27 కోట్ల వ్య‌యంతో బైర‌మాల్‌గూడ జంక్ష‌న్ వ‌ద్ద ఇరువైపులా రెండు ఫ్లైఓవ‌ర్ల నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ చేప‌ట్టింది. 2019 మార్చి నాటికి పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంతో 780 మీట‌ర్ల పొడ‌వుగ‌ల ఫ్లైఓవ‌ర్ నిర్మాణ ప‌నుల‌ను చేప‌ట్టారు.ఇటీవ‌ల కాలంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందిన నాగోల్ జంక్ష‌న్‌లో ట్రాఫిక్ ఇబ్బందుల‌ను దూరం చేయ‌డానికి రూ. 64.42కోట్ల వ్య‌యంతో రెండు ఫ్లైఓవ‌ర్ల‌ను జీహెచ్ఎంసీ నిర్మించ‌నున్న‌ది. 1,040మీట‌ర్ల పొడ‌వు, 12 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్నారు. ఉప్ప‌ల్ వైపు 180మీట‌ర్ల పొడ‌వు, ఎల్బీన‌గ‌ర్ వైపు 170మీట‌ర్ల పొడ‌వుతో ఈ ఫ్లైఓవ‌ర్ నిర్మాణాన్ని చేప‌ట్ట‌నున్నారు.