ముగిసిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్నిక హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ముగిసిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్నిక హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం!

న్యూఢిల్లీ, ఆగస్టు 10, (way2newstv.com)
రాజ్యసభ ఉప సభాపతి ఎన్నికలు ముగిసాయి. ఎన్డీయే అభ్యర్ధి, జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ ఎంపికఅయ్యారు. 26 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికలు జరిగాయి. రాజ్యసభ ఉపసభాపతిగా పోటీ చేసిన హరివంశ్ కు మద్దతుగా 122  ఓట్లు  వచ్చాయి. ఇందులో బీజేపీ నుంచి 73, ఎన్డీయేలోని ఇతర భాగస్వామ్య పక్షాలకు చెందిన 20 మంది, అన్నాడీఎంకే నుంచి 13, బీజేడీ నుంచి 9, టీఆర్ఎస్ నుంచి 6, నామినేటెడ్ సభ్యులు నలుగురు ఉన్నారు.   కాంగ్రెస్ అభ్యర్థి బికె హరిప్రసాద్ కు మద్దతుగా 98 ఓట్లు  పోలయ్యాయి. మొత్తం 222 సభ్యులు వొటింగ్ లో పాల్గోన్నారు. 
 
 
 
ముగిసిన రాజ్యసభ ఉపసభాపతి ఎన్నిక
హరివంశ్ నారాయణ్ సింగ్ ఘన విజయం!
 
ఇద్దరు సభ్యులు సభలో ఉండి కుడా ఓటింగులో పాల్గొనలేదు. గురువారం ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. ఆ తరువాత లాబీలను క్లియర్ చేయాలని ఆదేశించారు. ఆపై మూజువాణీ ఓటు ద్వారా హరివంశ్ గెలిచినట్టు ప్రకటించారు. విపక్ష సభ్యులు డివిజన్ కావాలని పట్టుబట్టడంతో ఓటింగ్ నిర్వహించారుఅనూహ్యపరిణామాల మధ్య ఎన్డీయేలో భాగస్వామిగా లేని టీఆర్ఎస్ ఆఖరి క్షణంలో బీజేపీ మద్దతుతో నిలబడిన జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ కు మద్దతు పలికింది. ఆయనకు అనుకూలంగా ఆరుగురు టీఆర్ఎస్ ఎంపీలూ ఓటు వేశారు. నిన్నటివరకూ విపక్షాల అభ్యర్థికి మద్దతిస్తామని చెప్పిన వైకాపా గురువారం  అనూహ్యంగా తన మనసు మార్చుకుంది. ఈ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నామని, ఓటింగ్ ను బాయ్ కాట్ చేస్తున్నామని ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. ప్రతిపక్షాల అభ్యర్థికి డిప్యూటీ చైర్మన్ గా అవకాశమిస్తానని తొలుత చెప్పి, ఆపై తమ పార్టీ అభ్యర్థిని కాంగ్రెస్ రంగంలోకి దించిందని, ఆ విషయాన్ని ముందుగా తమతో చర్చింలేదని విజయసాయి మండిపడ్డారు.