టీ వ్యాలెట్ ను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టీ వ్యాలెట్ ను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి

హైదరాబాద్, ఆగస్టు 10, (way2newstv.com)
తెలంగాణ సచివాలయంలో టీఎస్ ఆర్టీసీ టీ - వ్యాలెట్ ను రవాణా మంత్రి మహేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఐటీ సేవలను ఆర్టీసీలో టీ వ్యాలెట్ తో వినియోగిస్తారు. ప్రయాణికులకు ఆన్ లైన్ సేవలతో ప్రజలకు ప్రజా రవాణా      సేవలు మరింత అందుబాటులోకి తెస్తున్నామని మంత్రి అన్నారు. టీ వ్యాలెట్ తో  30 రోజుల ముందే సీట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఎస్ ఎం ఎస్   ద్వారా సమాచారం అందుతుంది. ఆర్టీసీ రోజూ 13 వేల మంది దూర ప్రాంతాల ప్రయాణికులను వారి వారి గయ్యస్థానాలకు చేరవేస్తుండగా ఆరు   వేల మందికి ఆన్ లైన్ టికెట్లు ఇస్తుంది. రాష్ట్రం నుండి 900 అంతరాష్ట్ర సర్వీసులు వివిధ     ప్రాంతాలకు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ఏపీకి కి 700 సర్వీసులుండగా మరో 100 పెంచుతున్నమని మంత్రి అన్నారు.  పొరుగు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్,    గోవా ప్రాంతాలకు సర్వీసులు నడుపుతున్నాం. త్వరలో కొత్తగా  వరంగల్ - పూనా సర్వీస్ ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. టీ వ్యాలెట్ ను ప్రారంభించిన మంత్రి మహేందర్ రెడ్డి