అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న కమల దళం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న కమల దళం

న్యూఢిల్లీ, ఆగస్టు 10 (way2newstv.com)   
 సార్వత్రిక సమరం సమీపిస్తున్న వేళ కమలనాథులు తమ ఎన్నికల అస్త్రాలాను సిద్దం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోలా... విజయ పరంపరను కొనసాగించేదుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఉహించని రీతిలో... ఎన్నికల్లో ప్రధాని మోడీ గెలుపుకోసం త్రీడీ ఫార్మెట్ ను అనుసరించనున్నారని ప్రచారం సాగుతోంది. ఈ ఆ త్రీడీ ఫార్ములా ఎంటనుకుంటున్నారా? అయితే వాచ్ దిస్ స్టోరీ..బీజెపీ నాలుగేళ్ళ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిప్రక్ష పార్టీలు. ఇక ఎన్నికల టైమ్ సమీపించడంతో కాషాయదళానికి చెక్ పెట్టేందుకు ఏకమయ్యే ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. ఏదేమైనా.. తమపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న విపక్షం నోరు మూయించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే త్రీడీ ఫార్ములాతో బరిలోకి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది.ప్రస్తుతం మోడీ సర్కార్ పై కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికల నాటికి మాత్రం  సత్పలితాలే వస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది. 2019 ఎన్నికల్లో మోడీ.. త్రీడీ ఫార్ములా తో సిద్దమవుతున్నారు. దేశ భద్రత, దళిత-బలహీన వర్గాల సంక్షేమం, రామమందిరం అనే మూడు అంశాలతో ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి ప్రత్యక్ష అజెండాగా.. రామ మందిర నిర్మాణం పరోక్ష అజెండాగా పోటీ చేసి, ఊహించని రీతిలో విజయం సాధించింది బీజేపీ.  
 
 
 
అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్న కమల దళం
 
వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ   ఇప్పటికే ఏక తాటిపైకి వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలకు మతోన్మాదమే కారణమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దళితులు, ముస్లింలు, బలహీన వర్గాలపై దాడులు పెరిగి పోయాయని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఎన్నికల నాటికి పుంజుకుంటామని.. గెలుపు తమనే వరిస్తుందని కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు. సార్వత్రిక సమరం సమీపిస్తున్న వేళ కమలనాథులు తమ ఎన్నికల అస్త్రాలాను సిద్దం చేసుకుంటున్నారు. గత ఎన్నికల్లోలా... విజయ పరంపరను కొనసాగించేదుకు కొత్త వ్యూహాలు రచిస్తున్నారు.బీజెపీ నాలుగేళ్ళ పాలనపై విమర్శలు గుప్పిస్తున్నాయి ప్రతిప్రక్ష పార్టీలు. ఇక ఎన్నికల టైమ్ సమీపించడంతో కాషాయదళానికి చెక్ పెట్టేందుకు ఏకమయ్యే ప్రయత్నాలూ ముమ్మరం చేశాయి. ఏదేమైనా.. తమపై అదేపనిగా ఆరోపణలు చేస్తున్న విపక్షం నోరు మూయించేందుకు బీజేపీ రెడీ అవుతోంది. ఈ క్రమంలోనే త్రీడీ ఫార్ములాతో బరిలోకి దిగేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకుంది.ప్రస్తుతం మోడీ సర్కార్ పై కొంత వ్యతిరేకత ఉంది. అయితే ఎన్నికల నాటికి మాత్రం  సత్పలితాలే వస్తాయని బీజేపీ విశ్వసిస్తోంది. 2019 ఎన్నికల్లో మోడీ.. త్రీడీ ఫార్ములా తో సిద్దమవుతున్నారు. దేశ భద్రత, దళిత-బలహీన వర్గాల సంక్షేమం, రామమందిరం అనే మూడు అంశాలతో ముందుకెళ్లే విధంగా ప్లాన్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో అభివృద్ధి ప్రత్యక్ష అజెండాగా.. రామ మందిర నిర్మాణం పరోక్ష అజెండాగా పోటీ చేసి, ఊహించని రీతిలో విజయం సాధించింది బీజేపీ. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా ఓడించాలని పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ   ఇప్పటికే ఏక తాటిపైకి వస్తున్నాయి. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన సంఘటనలకు మతోన్మాదమే కారణమంటూ విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి.మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకా దళితులు, ముస్లింలు, బలహీన వర్గాలపై దాడులు పెరిగి పోయాయని ఆరోపణలు గుప్పిస్తున్నాయి. అయితే.. ఎన్నికల నాటికి పుంజుకుంటామని.. గెలుపు తమనే వరిస్తుందని కమలనాథులు ధీమా వ్యక్తంచేస్తున్నారు.