ప్రియాంకకు హాలీవుడ్ షాక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రియాంకకు హాలీవుడ్ షాక్

ముంబై, ఆగస్టు 10 (way2newstv.com)   
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్ళి నటిగా బిజీ అయిపోయిన ప్రియాంక చోప్రా ఈమధ్య వార్తల్లో ఎక్కువగా కనిపిస్తోంది. హాలీవుడ్ సింగర్ నిక్ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్ కోసమే సల్మాన్‌ఖాన్ హీరోగా నటిస్తున్న ‘భరత్’ చిత్రం నుంచి తప్పుకుందని ప్రచారం జరిగింది. తాజాగా సోనాలీ బోస్ ‘ద స్కై ఈజ్ పింక్’ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు పిగ్గీ చాప్స్. అయితే హాలీవుడ్ మూవీ ‘కౌబాయ్ నింజా వికింగ్’లో నటించడం కోసమే ప్రియాంక భరత్ సినిమాను వదులుకున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం కౌబాయ్ నింజా వికింగ్ సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రియాంకకు షాక్ ఇచ్చారునిర్మాత హాలీవుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ పోర్టల్ కథనం ప్రకారం ‘కౌబాయ్ నింజా వికింగ్’ సినిమా ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్ళే సూచనలు కనిపించడం లేదు. ప్రస్తుతానికి డైరెక్టర్ మిచెల్ మెక్‌లారెన్ స్క్రిప్టు డెవలప్ చేసే పనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాలో క్రిస్ ప్రాట్‌తో ప్రియాంక కూడా నటిస్తారు. హాలీవుడ్ సినిమాలో నటించేందుకు ‘భరత్’ చిత్రాన్ని ప్రియాంక వదులుకోవడంతో ఆ అవకాశం కత్రినా కైఫ్‌కు దక్కింది. ప్రియాంకకు హాలీవుడ్ షాక్