అమరావతి బాండ్లకు భారీగా ఇన్వెస్టర్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అమరావతి బాండ్లకు భారీగా ఇన్వెస్టర్లు

విజయవాడ, ముంబై, ఆగస్టు 15, (way2newstv.com)
నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్లు ఇన్వెస్ట‌ర్ల‌కు అందుబాటులో వ‌చ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది. మ‌న దేశంలో ఓ రాజధాని నిర్మాణం కోసం బాండ్లు రిలీజ్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ బాండ్లు రూ.10 లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది. బీఎస్‌ఈలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. 
 
 
 
అమరావతి బాండ్లకు భారీగా ఇన్వెస్టర్లు
 
వీటిపై మదుపర్లు ఆసక్తి చూపడంతో త్వరగానే అమ్ముడుపోయాయి. మధ్యహ్నం 12 గంటల తర్వాత మరిన్ని బాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. బాండ్ల విక్రయాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి బాండ్లు ఇన్వెస్ట‌ర్ల‌కు అందుబాటులో వ‌చ్చాయి. అమరావతి నిర్మాణానికి నిధులు సేకరించే పనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమరావతి షేర్లను స్టాక్‌ ఎక్ఛ్సేంజీలో అమ్మకానికి పెట్టింది. మ‌న దేశంలో ఓ రాజధాని నిర్మాణం కోసం బాండ్లు రిలీజ్ చేయ‌డం ఇదే తొలిసారి. ఈ బాండ్లు రూ.10 లక్షల ముఖ విలువతో సంస్థాగత మదుపర్లకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. తొలి విడతలో భాగంగా రూ.1,300 కోట్ల నిధుల సేకరణకు అమరావతి బాండ్లను సీఆర్‌డీఏ విడుదల చేసింది. ఎలక్ట్రానిక్‌ బిడ్డింగ్‌ ప్లాట్‌ఫాం ద్వారా తొలివిడతలో 600 బాండ్లు విక్రయానికి అందుబాటులో ఉంచారు. వీటిపై మదుపర్లు ఆసక్తి చూపడంతో త్వరగానే అమ్ముడుపోయాయి. మధ్యహ్నం 12 గంటల తర్వాత మరిన్ని బాండ్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలుస్తోంది. బాండ్ల విక్రయాలను సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌ సహా ఉన్నతాధికారులు కార్యాలయం నుంచే పర్యవేక్షిస్తున్నారు.