నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్ రైలు లింగంపల్లి వరకు పొడిగింపు! - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్ రైలు లింగంపల్లి వరకు పొడిగింపు!

హైదరాబాద్ ఆగస్టు 20, (way2newstv.com)
సికింద్రాబాద్-తిరుపతి మధ్య ప్రయాణించే నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్ రైలును లింగంపల్లి వరకు పొడిగిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. వచ్చే నెల 5 నుంచి నారాయణాద్రి ఎక్స్‌ప్రెస్ లింగంపల్లి నుంచి బయలుదేరుతుందని దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే ప్రకటనపై శివారు ప్రాంతాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెప్టెంబరు 5న నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్ (12734) సాయంత్రం 5:15 గంటలకు లింగంపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 6:05 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. తిరిగి అదే రోజు సాయంత్రం 6:25 గంటలకు తిరుపతి నుంచి రైలు(12733) బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7:15 గంటలకు లింగంపల్లి చేరుకుంతుంది.
 
 
 
నారాయణాద్రి ఎక్స్‌ ప్రెస్ రైలు లింగంపల్లి వరకు పొడిగింపు!