అర్జున్ రెడ్డికి తమిళం, కన్నడలలో రీమేక్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అర్జున్ రెడ్డికి తమిళం, కన్నడలలో రీమేక్

హైద్రాబాద్, ఆగస్టు 21, (way2newstv.com)
అర్జున్ రెడ్డి’ సినిమాతోనే విజయ్ దేవరకొండ పేరు మార్మోగింది. అర్జున్ రెడ్డి పాత్రను అవలీలగా, అద్భుతంగా పోషించిన విజయ్‌కు ఆ సినిమా తర్వాత పక్క భాషల్లో కూడా అవకాశాలు వచ్చాయి. అర్జున్ రెడ్డి సినిమాను తెలుగు వారితో పాటు తమిళులు, కన్నడీగులు కూడా చూసేశారు. ప్రస్తుతం ఆయా భాషల్లో ఆ సినిమా రీమేక్ అవుతోంది కూడా. ఇప్పటికే విజయ్ దేవరకొండ తమిళంలో ఒక సినిమాకు సైన్ చేసేశాడు. నోటా’ పేరుతో తమిళంలో ఒక సినిమా రూపొందుతోంది. అందులో విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఇప్పుడు విశేషం ఏమిటంటే ఈ హీరో తాజా సినిమా ‘గీతగోవిందం’ కూడా పక్క రాష్ట్రాల్లో మంచి వసూళ్లను రాబడుతోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు, కర్ణాటకల్లో కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు లభిస్తుండటం విశేషం. కర్ణాటకలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలు, బెంగళూరుల్లో గీతగోవిందం సినిమాకు మంచి వసూళ్లున్నాయని ట్రేడ్ రిపోర్ట్ చెబుతోంది. అర్జున్ రెడ్డి హీరో మరోసారి ఆకట్టుకుంటున్నాడనే ప్రచారంతో ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి. ఇక తమిళనాడులోని చెన్నై, కోయంబత్తూర్ ప్రాంతంలో ‘గీతగోవిందం’ సినిమాకు మంచి వసూళ్లు ఉండటం గమనార్హం. ఈ విధంగా పక్క రాష్ట్రాల్లో కూడా విజయ్ ‌కి మంచి మార్కెట్ కనిపిస్తోంది. ఇది జ్ఞాన‌వేల్ రాజాకు ఆనందాన్ని ఇచ్చే విషయమే. ఎందుకంటే.. విజయ్ దేవరకొండతో ‘నోటా’ సినిమాను రూపొందిస్తున్నది ఆ నిర్మాతే. విజయ్ వరస విజయాలతో ఉండటం ‘నోటా’ సినిమాకు ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంది.
 
 
 
అర్జున్ రెడ్డికి తమిళం, కన్నడలలో రీమేక్