కాంగ్రెస్ నేతలకు కళ్లు చెవులు లేవు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాంగ్రెస్ నేతలకు కళ్లు చెవులు లేవు

తాండూరు, సెప్టెంబర్ 4, (way2newstv.com)
ప్రగతి నివేదన సభ సూపర్ హిట్ అయింది.  ప్రపంచంలోనే ఎక్కడా జరగని విధంగా ప్రగతి నివేదన సభ విజయవంతమైంది. ఊహించని విధంగా ప్రగతి నివేదన సభకు లక్షలాది జనం రావడంతో కాంగ్రెస్ వాళ్లు ఓర్వలేకపోతున్నారని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. రాజకీయాల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శించడం తప్ప కాంగ్రెస్ వాళ్లకు మిగిలిందేమీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు కళ్లు, చెవులు లేనట్లు న్నాయి.  అభివృద్ధి కనిపించదు, ప్రజల భావన వినిపించదు.  ఇలా ఒకరు ఎన్నిక లంటారు ,మరొకరు ఢిల్లీలో ఆపుతా మంటారు  కోర్టుకెళ్లి,మరొకరు సిద్ధం అంటారు, మరొకరు ఎందుకంటారని అయన వ్యాఖ్యానించారు. ఎన్నికలంటే వాళ్లకు భయమెందుకు.  టీఆర్ఎస్ పార్టీ రేపు ఎల్లుండి ఇంకా ఎనిమిది నెలలకు ఇలా ఎన్నికలు  ఎప్పుడొచ్చినా సిద్ధంగానే ఉంది. రైతుల కోసం, ప్రజల కోసం తపించిన పార్టీ టీఆర్ఎస్, తపిస్తున్న సిఎం కెసిఆర్ . తాండూరులో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధి కోసం కోట్లాది నిధులను కేటా యించామని అన్నారు. నిధులు మంజూరయ్యాక నిధుల కోసం ధర్నా చేయడం, ప్రజలను మభ్య పెట్టడం వారి నైజాం.  రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా లో మున్సిపాలిటీకి ఔటర్ రింగురోడ్డు మంజూరు చేసిన ఘనత సీఎం ది.  తాండూరులో కోటి నిధులతో ఎస్టీలకు, కోటి నిధులతో ఎస్సీలకు కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నాం. బీసీలలో వడ్డెరులకు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నాం.  ఇలా సామాజిక అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నాం. ముదిరాజ్ లకు , గంగపుత్రులకు లింగాయతులు ఇలా అన్ని కులాలకు రాజకీయాలకు అతీతంగా కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాంగ్రెస్ నేతలకు కళ్లు చెవులు లేవు