రాహుల్ పర్యటనతో ఒరిగేదేమి లేదు : మంత్రి తలసాని

మహబూబ్ నగర్  (way2newstv.com)
వలసల జిల్లా పాలమూరు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో అభివృద్ధి చెందింది. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సంవత్సరాల తరబడి పెండింగ్ లో  ఉన్న ప్రాజెక్టు ల ను తెలంగాణ వచ్చిన 4 సంవత్సరాలలో పూర్తి చేసిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం నాడు జడ్చర్లలో అయన మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం పని చేస్తుంది. అధికారంలో ఉన్న నాడు ప్రజల బాగోగులు మరిచి నేడు ప్రభుత్వం పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. మా కోసం పని చేసే ఏకైక ప్రభుత్వం తెరాస అనే ధీమాతో ప్రజలు దైర్యంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలకు పదవులపై ఉన్న ప్రేమ ప్రజలపై లేదు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటన తో  ఒరిగేదేమీ లేదని మంత్రి అన్నారు.




రాహుల్ పర్యటనతో ఒరిగేదేమి లేదు :  మంత్రి తలసాని 
Previous Post Next Post