కొత్త స్టేషన్లకు, హాల్ట్ లుకు గ్రీన్ సిగ్నల్

విశాఖపట్టణం, జనవరి 31, (way2newstv.com)
విశాఖ నుంచి దేశ నలుమూలలకు వెళ్తున్న పలు ఎక్స్‌ప్రెస్‌లకు సంబంధించి కొత్తగా మరికొన్ని స్టేషన్లలో హాల్ట్‌ను ఏర్పాటుచేశారు అలాగే గత కొంతకాలంగా వెళ్తున్న స్టేషన్ల నుంచి మరికొన్ని స్టేషన్ల వరకు వీటిని పొడిగించడం జరిగింది. దీంతో ప్రయాణికులకు కాస్తంత ఊరటనిచ్చినట్టు అయ్యింది. రూర్కెలా-కోరాపుట్ ఎక్స్‌ప్రెస్ (18107/18108) జగదల్‌పూర్ వరకు పొడిగించబడింది. అలాగే ఇది ఇక నుంచి జయపూర్, కోరాపుట్ రోడ్డుస్టేషన్ల వరకు వెళ్ళనుంది. హౌరా-విజయవాడ(20889/20890) హంసాఫర్ ఎక్స్‌ప్రెస్ తిరుపతి వరకు పొడిగించారు. ఇది ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటల మీదుగా వెళ్ళనుంది. ఇక విల్లుపురం-ఖరగ్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (22604/22603) పురిలియా వరకు వెళ్ళనుంది.


 కొత్త స్టేషన్లకు, హాల్ట్ లుకు గ్రీన్ సిగ్నల్

ఇది హిజిలీ, మిదనాపూర్, భిష్నుపూర్, బంకురా, ఆద్రా స్టేషన్లలో అదనంగా హాల్ట్‌లు నిర్ణయించబడ్డాయి. కటక్-బ్రహ్మపూర్ (68433/68434) ఇచ్ఛాపురం వరకు వెళ్ళనుంది. అయితే ఈమార్గంలోనడిచే అన్ని రైల్వేస్టేషన్ల వద్ద ఆగనుంది. నిత్యం రద్దీగా ఉండే వలసకూలీలు ఎక్కువుగా తిరిగే విశాఖపట్నం-పలాస (58526/58525) పాసింజర్ బ్రహ్మపూర్‌కు వరకు పొడిగించబడింది. ఇది నడిచే మార్గంలో అన్ని స్టేషన్లలో దీనికి హాల్ట్ ఉంటుంది. విశాఖపట్నం-తిరుపతి (17488/17487) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 31వ తేదీ నుంచి కడపకు పొడిగించబడింది. అయితే ఇది రేణిగుంట, కోడూరు, రాజామ్‌పేట, నందలూరు స్టేషన్లలో హాల్ట్ ఉంటుంది. వీటి మీదుగా వెళ్ళనుంది. కొత్తగా పలు రైళ్ళకు కల్పించిన సదుపాయాలపై ప్రయాణికులకు కాస్తంత ఊరటనిస్తున్నా కొత్త రైళ్ళు ఎలాగూ లేవని, వాల్తేరుడివిజన్‌కు తొలి నుంచి కోచ్‌ల కొరత వేదిస్తోందని ఇటువంటి వాటిపై దృష్టిసారించి సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు
Previous Post Next Post