అవసరం లేకున్నా–అడుగకున్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అవసరం లేకున్నా–అడుగకున్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు

కేంద్ర ప్రభుత్వంపై బి.సి సంఘాలు ధ్వజం
హైదరాబాద్ ఫిబ్రవరి 4 (way2newstv.com):
అవసరం లేకున్నా, అడుగకున్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు పెట్టారు. కాని బి.సిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు పెట్టాలని 30 సంవత్సరాలుగా ఉద్యోమాలు చేస్తుంటే దాని అతి   గతి లేదని 14 బి.సి సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తాయి. ఈ దేశంలో బి.సిలలో పుట్టడమే పాపమైంది. బి.సిలను ఏ రాజకీయ పార్టీ పట్టించుకోవడంలేదని విమర్శించాయి. 


అవసరం లేకున్నా–అడుగకున్న అగ్రకులాలకు 10 శాతం రిజర్వేషన్లు

పేరుకే ధనస్వామ్యంగా అగ్రకుల స్వామ్యంగా మారిపోయిందని విమర్శించాయి. గత 5 రోజులుగా జాతీయ బి.సి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డిల్లికి వెళ్లి కాంగ్రెస్,డిఎంకే, అన్నా డిఎంకే, జనతాదళ్, తృణముల్ కాంగ్రెస్, వైఎస్ఆర్సిపి, టిడిపి, రాష్ట్రీయ జనతాదళ్, సమాజ్ వాది పార్టీ నాయకులను కలిసి పార్లమెంటులో బి.సి బిల్లు పెట్టాలని వత్తిడి పెట్టం. ఇవి చివరి పార్లమెంట్ సమావేశాలు, ఇప్పుడు పెట్టకపోతే ఇంకెప్పుడు పెడుతారని ప్రశ్నించాo. పైగా దేశ ప్రధాని బి.సి వర్గానికి చెందినవారు. బి.సిలకు రాజకీయ రిజర్వేషన్లు పెట్టకపోతే చరిత్ర క్షమించదని హెచ్చరిస్తున్నాం. బి.సిలకు రాజకీయ రిజర్వేషన్లు పెడితే ప్రధానమంత్రి చరిత్రలో నిలిచిపోతారన్నారు.