పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తాం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తాం

అధికార దుర్వినియోగం తో గెలిచినా టిఆర్ఎస్
కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ విజయ శాంతి,కో చైర్మన్ డి.కే.అరుణ
హైదరాబాద్ ఫిబ్రవరి 4 (way2newstv.com):
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తా మని కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ విజయ శాంతి,కో చైర్మన్ డి.కే.అరుణ తెలిపారు.సోమవారం డీకే అరుణ నివాసం లో ఏర్పాటు చేసుఇన మీడియా సమావేశం లో వారు మాట్లాడుతూ మొన్న జరిగిన ఎంఎల్ఏ ఎన్నికలలో టీఆరెస్ పార్టీ కి వచ్చిన గెలుపు వైట్ రాయల్ కాదన్నారు.ఎన్నికల్లో ఇవిఎంలు ,డబ్బు ఇలా అనేక అంశాలు అనేక అవకతవకలు జరిగాయన్నారు.రేవు కేంద్రంలో మోడీకి మద్దతు ఇవ్వడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని విజయశాంతి ఆరోపించారు.వెస్ట్ బెంగాళ్ లో మమత బెనర్జీ కి మద్దతు ఇవ్వకుండా కేసీఆర్ సైలెంట్ గా ఉన్నారు.


 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను విజయం దిశగా నడిపిస్తాం

ఫెడరల్ ఫ్రంట్ అంటూ మమతా బెనర్జీ మద్దతు కోరిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ చెప్పిన అబద్దాలు ప్రజలు నమ్మారని,కానిఫామ్ హౌస్ లో కూర్చోని పాలన సాగిస్తాం అని మాట్లాడుతూ ప్రజలను అవమాణిస్తున్నారు.పోయిన ఎన్నికల్లో కుట్రలు జరిగాయి,ఇప్పుడు మరోసారి పోరాడుతామన్నారు.బ్యాలెట్ బాక్స్ తేవాలని అన్నిపార్టీలు చెబుతున్నాయన్నారు.ఇవిఎంలు టాంపరింగ్ అవుతున్నాయి అనుమానం ఉందని వారు స్పష్టం చేసారు.మోడీ తప్పులను కేసీఆర్,కేసీఆర్ తప్పులను మోడీ దాస్తున్నారు.అనంతరం కో చైర్మన్ డి.కే.అరుణ మాట్లాడుతూ టీఆరెస్ పార్టీ మొన్నటి ఎన్నికల్లో దొడ్డిదారిన అధికారంలోకి వచ్చింది.పార్లమెంట్ ఎన్నికలలో 16స్థానాలు మేమె గెలుస్తాం అని టీఆరెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు.మరోసారి అధికార దుర్వినియోగం చేయాలని టీఆరెస్ పార్టీ కుట్రను ప్రజలు తిప్పికొడతారు.తెలంగాణ లో పార్లమెంటు స్థానాలను అత్యధికంగా కాంగ్రెస్ ను గెలిపించాలని వాడు కోరారు.ఫెడరల్ పార్లమెంట్ తీసుకోస్తాం అంటూ ప్రజలను మరిసారీ మోసం చేయాలని టీఆరెస్ పార్టీ చూస్తుందని విమర్శించారు.విభజన హామీలను ఏఒక్కటీ సాధించలేని టీఆరెస్ పార్టీ మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారు.తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి కృతజ్ఞతగా అత్యధిక పార్లమెంటు స్థానాలను కాంగ్రేస్ కు గెలిపించాలన్నారు.టీఆరెస్ కుట్రలకు ప్రజలు మరోసారి మోసపోవద్దన్నారు.ఎన్నికల కమిషన్ అధికార దుర్వినియోగం చేసింది,టీఆరెస్ పార్టీకి తొత్తుగా వ్యవహరించిందని ఆరోపించారు.అభివృద్ధి చెందిన దేశాలు బ్యాలెట్ పేపర్ వాడుతున్నాయి.అందరి పార్టీల డిమాండ్ విషయంలో ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకోవాలని కోరారు.20 లక్షల ఓట్లు తీసివేసాం అని రజత్ కుమార్ సారీ చెప్పారు.దీనివల్ల ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ కి చాలా నష్టం జరిగిందన్నారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా మన్నారు.టీపీసీసీ మార్చే నిర్ణయం హై కమాండ్ దే నన్నారు..క్యాంపెయిన్ చైర్ పర్సన్ గా నన్ను మా టీమ్ ను నియమించినదుకు రాహుల్ గాంధీకి వారు ధన్యవాదాలు తెలిపారు.