జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్

అగ్రవర్ణ పేదల కోటా వర్తిస్తుంది: కేంద్రం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి, 20 (way2newstv.com)
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షను యూపీఎస్సీ ఈ ఏడాది జూన్2న నిర్వహించనుంది. ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత ఉద్యోగాల్లో 896 పోస్టుల భర్తీల కోసం ప్రిలిమ్స్ పరీక్షను చేపడుతున్నట్లు యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది. అగ్రవర్ణాల్లో ఆర్ధికంగా వెనుకబడిన వారికి కేటాయించిన 10శాతం రిజర్వేషన్ ఈ నోటిఫికేషన్కూ వర్తింపజేస్తున్నట్లు కేంద్రం స్పష్టంచేసింది. 896 ఖాళీల్లో అంధులు, యాసిడ్ దాడి బాధితులు తదితర వికలాంగులకోసం 39 పోస్టులు రిజర్వ్చేశారు. మార్చి 18వ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోపు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.


జూన్ 2న సివిల్స్ ప్రిలిమ్స్

సివిల్స్ పరీక్షను ఏటా మూడు దశల్లో( ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ) కేంద్రం నిర్వహిస్తోంది. ఈ పరీక్షకు ఆరు అటెంమ్ట్లను మాత్రమే అనుమతిస్తారు. 1987 ఆగస్ట్2లోపు, 1998 ఆగస్ట్ ఒకటికి ముందు జన్మించిన వారు మాత్రమే ఈ పరీక్ష రాసేందుకు అర్హులు. అంటే దరఖాస్తు చేయడానికి కనీస వయసు 21ఏళ్లు. అలాగే, 32 సంవత్సరాలు నిండనివారు కూడా అర్హులేనని నోటిఫికేషన్ పేర్కొంది.