ప్రత్యర్ధులతో అప్రమత్తం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రత్యర్ధులతో అప్రమత్తం

అమరావతి, ఫిబ్రవరి 21, (way2newstv.com)
బుధవారం జరిగిన  ఉద్యోగ సంఘాలతో భేటి స్ఫూర్తినిచ్చింది. విభేదాలు వీడి ఉద్యోగులంతా సంఘీభావం ప్రకటించారు. మళ్లీ మీరే రావాలంటూ ఉద్యోగుల్లో ఆకాంక్ష వెలిబుచ్చారు. ఉద్యోగుల్లో సానుకూలత శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం పార్టీ నేతలతో అయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధిలో ఉద్యోగుల సహకారం కీలకం. ప్రత్యర్ధుల నేరచరిత్ర గుర్తుంచుకోవాలని అన్నారు. హత్యలు, దోపిడిలు, దాడులు ప్రత్యర్ధుల సంస్కృతి. ఆధిక్యం కోసం దేనికైనా దిగజారే పార్టీ వైసిపి అని విమర్శించారు. వాళ్లే సీన్ క్రియేట్ చేస్తారు. వాళ్లే దుష్ప్రచారం చేస్తారు.  ఫొటోలు మార్పింగ్ చేస్తారు. వీడియో కటింగ్ లు చేస్తారు. ప్రతిపక్షం తప్పుడు పనులను సమర్ధంగా ఎదుర్కోవాలని అన్నారు. నేరస్థుల ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. 


ప్రత్యర్ధులతో అప్రమత్తం

నేరస్థులతో పోరాటంలో మరింత అప్రమత్తత కావాలి. ఈ ఎన్నికల్లో మనం పోటిబడేది నేరస్థులతో  చేయని తప్పులు మనపై రుద్దుతారని అన్నారు. తప్పులు జరిగేలా స్కెచ్ లు వాళ్లే వేస్తారు. ఒక కన్ను ఎప్పుడూ ప్రతిపక్షంపై ఉండాలి. రాజధానిలో రూ.లక్ష కోట్ల అవినీతి అని దుష్ప్రచారం చేస్తున్నారు. వెంటనే నేను ఖండిస్తే వెనక్కి పోయారు. భూములు రైతుల వద్దే ఉంటే అవినీతికి చోటెక్కడ..? రాజధానికి భూములు ఇవ్వకుండా రెచ్చగొట్టారు. రైతులు వినకపోతే విధ్వంసాలకు తెగపడ్డారు. అరటితోటల ధ్వంసం,చెరకు తోటలు తగులపెట్టారు.  రైతుల పొలాల్లో బోర్లు ధ్వంసం చేశారు. రాజధానికి, పోలవరంకు వ్యతిరేకంగా అనేక కేసులు వేశారు.  గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు దాకా కేసులు రాజకీయాల్లో నేరగాళ్లను తెచ్చిన పార్టీ వైసిపని విమర్శించారు. నేరమయ రాజకీయాలకు చిరునామా జగన్ కుటుంబం. మోది, షా, కెసిఆర్,జగన్ కుమ్మక్కై కుతంత్రాలు.  నలుగురి కుట్రలను ధైర్యంగా ఎదుర్కోవాలి. మోది, కెసిఆర్ అధికార దుర్వినియోగం చేస్తున్నారు.  సామాన్యుల్లో భయం పెంచుతున్నారు. ఓటమి భయంతోనే వైసిపి కుట్రల మీద కుట్రలు పన్నుతున్నారు. ఓటమి భయంతోనే కులాల మధ్య చిచ్చు. వీటన్నింటినీ తిప్పికొట్టాలి, ప్రజలకు వివరించాలి. ధైర్యంగా మనం ఎదుర్కొంటేనే ప్రజల్లో విశ్వాసం వుంటుందని అన్నారు. 
టెలీ కాన్ఫరెన్స్ లో లక్ష్మీస్ ఎన్టీఆర్’  చిత్రంపై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించేలా కొందరు కుట్రలు పన్నుతున్నారని, కుట్రదారుల దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని నేతలకు సూచించారు. ఎన్టీఆర్ స్ఫూర్తిని అందరూ చాటిచెప్పాలని, అందుకే ‘మహా నాయకుడు, కథానాయకుడు’ సినిమాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్న చంద్రబాబు వాస్తవాలను వక్రీకరించేవారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు.