విద్యార్థి దశ నుండే పిల్లలు నైతిక ,సాంఘిక విలువలను పెంపొంధించుకోవాలి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

విద్యార్థి దశ నుండే పిల్లలు నైతిక ,సాంఘిక విలువలను పెంపొంధించుకోవాలి

చేర్యాల, ఫిబ్రవరి 20 (way2newstv.com
విద్యార్థి దశ నుండే పిల్లలు తమలో నైతిక సాంఘిక విలువలను పెంపొందించుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని ప్రముఖ సైకాలజిస్డ్ నాగేశ్వరావు పేర్కొన్నారు.బుధవారం చేర్యాల పట్టణంలోని కళ్యాణి గార్డెన్ లో చేర్యాల ,కొమురవెల్లి మండలాలగామారు 1200  పదవ తరగతి విద్యార్థులకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు  ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ..ఈ కార్యక్రమానికి చేర్యాల, కొమురవెల్లి మండలాల మండల విద్యాశాఖ అధికారి జి.రాములు  అధ్యక్షత వహించారు ..విద్యార్థి దశ నుండే పిల్లలు తమలో నైతిక సాంఘిక విలువలను పెంపొందించుకొని భవిష్యత్తులో ఉత్తమ పౌరులుగా ఎదగాలని శ్రీ నాగేశ్వరావు  పేర్కొన్నారు.. కుటుంబంలో తల్లిదండ్రుల పాత్ర సమాజంలో గురువుల పాత్రను విద్యార్థులు ఎదుగుదలలో వారి ఆవశ్యకతను గురించి నాగేశ్వరావు గారు చక్కగా విద్యార్థులకు బోధించారు.. 


విద్యార్థి దశ నుండే పిల్లలు నైతిక ,సాంఘిక విలువలను పెంపొంధించుకోవాలి

పదవ తరగతి విద్యార్థులు తమ విలువైన సమయం వృధా చేయకుండా వార్షిక పరీక్షల కొరకు సన్నద్ధం కావాలని ఏలాంటి భయము భావోద్వేగాలు లేకుండా పరీక్షల గదిలో ప్రశాంతంగా పరీక్షలు రాయాలని పేర్కొన్నారు, విద్యార్థులు తమ ఉపాధ్యాయుల సూచనలు తప్పకుండా పాటించి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించాలని నాగేశ్వర రావు పిల్లలను కోరారు.. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రవికాంత్ రావు గారు మాట్లాడుతూ నాగేశ్వరావు గారు చేస్తున్న కృషిని కొనియాడారు.. విద్యార్థులు పదవ తరగతి వార్షిక పరీక్షల లో ఉత్తమ ఫలితాలు సాధించి తమ తల్లిదండ్రులు గర్వించేలా చేయాలని  రవి కాంత రావు గారు కోరారు.. ఈ కార్యక్రమ దాతలుగా శ్రీ కందుకూరి ఉపేందర్ ,మురళి లు  వ్యవహరించారు ..వీరిని పలువురు కొనియాడారు..ఈ కార్యక్రమం లో   ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఐలయ్య , లక్ష్మా రెడ్డి , లక్ష్మీ  ,నరేందర్,శ్రీరాములు,,శ్రీనివాస్,,మంజుభార్గవి పాల్గొన్నారు విద్యార్థులకు చక్కటి మార్గం నిర్దేశకం చేసిన శ్రీ నాగేశ్వరరావు గారిని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రవి కాంత రావు గారు మరియు మండల విద్యాశాఖ అధికారి శ్రీ రాములుు, పలువురు ప్రధాన ఉపాధ్యాయులు  ,వేట్ పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించారు.