తిరుమలలో నీటి కోసం 8.50 కోట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

తిరుమలలో నీటి కోసం 8.50 కోట్లు

తిరుమల, ఫిబ్రవరి 20, (way2newstv.com
తిరుమలలో తాగునీటి అవసరాలు తీర్చేందుకు రూ. 8.50 కోట్లు కేటాయించారు. ఇందులో తిరుపతిలోని కల్యాణి డ్యామ్ స్టేజ్-1 నుంచి శ్రీవారి మెట్టు వద్ద స్టేజ్-2 వరకు అదనపు పైప్ లైన్ ఏర్పాటుకు రూ. 8.50 కోట్లు కేటాయించింది. దీంతో తిరుమలకు 14 ఎంఎల్‌డిల నీటిని తిరుమలకు సరఫరా చేసే అవకాశం ఉంది. తిరుపతిలోని శ్రీపద్మావతి కల్యాణ మండపం, శ్రీనివాస కల్యాణ మండపాల ఆధునీకరుణకు రూ. 8.32 కోట్లతో టెండర్లకు ఆమోదం తెలిపింది. తిరుమలలోని శంఖుమిట్ట కాటేజీల ప్రాంతంలో ప్రత్యేక అభివృద్ధి పనులు, మరమ్మతులు చేయడానికి రూ. 5.15 కోట్లు మంజూరుకు ఆమోదించింది. తిరుమలలో సాధారణ పారిశుద్ధ్యం పనులు చేపట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన సులభ్ ఇంటర్నేషనల్ సోషల్ సర్వీస్ సంస్థకు ఒప్పంద కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదం తెలిపింది. 


తిరుమలలో నీటి కోసం 8.50 కోట్లు

తిరుమలలోని శ్రీవారి పోటు ఉగ్రాణంలో పనిచేస్తున్న కార్మికుల కాంట్రాక్ట్ కాలపరిమితిని మరో ఏడాది పొడిగింపునకు ఆమోదించింది. తిరుమలలోని దక్షిణ ప్రాంత పరిధిలోని కాటేజీలు, అశ్విని ఆస్పత్రిలో ఎఫ్‌ఎంఎస్ సేవలను నిర్వహించేందుకు ఏ 1 ఫెసిలిటీ, ప్రాపర్టీ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మూడు సంవత్సరాల కాలానికి కేటాయించేందుకు రూ. 36.50 కోట్లు మంజూరు చేసింది. తిరుమలలోని తూర్పు ప్రాంత పరిధిలోని అష్టవినాయక, నందకం, పాంచజన్యం, కౌస్త్భుం విశ్రాంతి గృహాల్లో ఎఫ్‌ఎంఎస్ సేవలను మూడు సంవత్సరాలు నిర్వహించేందుకు కల్పతరు సంస్థకు కేటాయించేందుకు రూ. 17.50 కోట్లు సమావేశం మంజూరు చేసింది. తిరుమలలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో అదనపు భోజనశాల, వంటశాల నిర్మాణానికి రూ. 4.95 కోట్లు మంజూరు చేసింది. తిరుమలలోని పశ్చిమ ప్రాంత పరిధిలోని కాటేజీలు, విశ్రాంతి భవనాల్లో మూడు సంవత్సరాలకు ఎఫ్‌ఎంఎస్ సేవలను నిర్వహించేందుకు పద్మావతి సంస్థకు కేటాయించేందుకు రూ. 28.50 కోట్లు మంజూరు చేసింది. తిరుపతిలోని శ్రీనివాసం వసతి సముదాయాల పరిధిలోని ఎఫ్‌ఎంఎస్ సేవలను పద్మావతి మేనేజ్‌మెంట్ సర్వీస్ సంస్థకు మూడు సంవత్సరాల పాటు కేటాయించేందుకు రూ. 17 కోట్లు మంజూరు చేసింది. తిరుమలలోని పాంచజన్యం విశ్రాంతి గృహం తూర్పు వైపున వంటశాల బ్లాకు నిర్మాణానికి రూ. 12.50 కోట్లు, తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్‌లోని 76 నివాసగృహాలను సూట్లుగా మార్చి భక్తులకు కేటాయించేందుకు రూ. 3.65 కోట్లు, తిరుమలలోని బి టైప్ క్వార్టర్స్ వద్ద అదనపు యాత్రికుల వసతి సముదాయం నిర్మాణానికి రూ. 47.44 కోట్లు మంజూరు చేశారు.