జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతి .. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతి ..

హైదరాబాద్, , ఫిబ్రవరి 16, (way2newstv.com
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లేందుకు సీబీఐ కోర్టు శనివారం అనుమతి ఇచ్చింది. లండన్లో చదువుకుంటున్న తన కుమార్తె దగ్గరకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జగన్ పెట్టుకున్న పిటిషన్ను విచారించిన కోర్టు,  ఈ నెల 18 నుంచి మార్చి 15 మధ్య పది రోజుల పాటు జగన్ లండన్లో పర్యటించేలా ఏడాది కాలపరిమితితో పాస్పోర్టు జారీ చేయాలని పాస్పోర్టు అధికారులను ఆదేశించింది.  అలాగే, లండన్లో జగన్ పర్యటించే ప్రదేశాలు, ల్యాండ్ఫోన్, సెల్ నంబరు, ఈ-మెయిల్, ఫ్యాక్స్ నంబర్లను కోర్టుతోపాటు సీబీఐ అధికారులకు సమర్పించాలని ఆదేశించింది.


జగన్ లండన్ వెళ్లేందుకు అనుమతి ..