శ్వేత పత్రం విడుదలకు డిమాండ్

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 16, (way2newstv.com
తెలుగుదేశం పార్టీ ఓ డ్రామా కంపెనీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. శనివారం అయన మీడియాతో మట్లాడారు. చంద్రబాబులా మేం రోజుకో వేషం వేయలేమన్నారు.  తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు ఏపీలో ఎందుకు వదిలేశారని   ప్రశ్నించారు.  

 
శ్వేత పత్రం విడుదలకు డిమాండ్

స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేస్తే రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు కేంద్రం  సిద్దంగా వుందని అన్నారు.  ప్యాకేజీని సమర్థించిన తీర్మానాలను అసెంబ్లి రికార్డుల నుంచి తొలగించారని విమర్శించారు.  చంద్రబాబుకు దమ్ముంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.  ఏపీలో ఒంటరిగానే పోటీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 21న రాజమండ్రిలో ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం అవుతారని కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.
Previous Post Next Post