ఉగ్రదాడికి ఖండించిన కేసీఆర్..జన్మదిన వేడుకలు వద్దని నిర్ణయం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఉగ్రదాడికి ఖండించిన కేసీఆర్..జన్మదిన వేడుకలు వద్దని నిర్ణయం

హైదరాబాద్, ఫిబ్రవరి 15, (way2newstv.com
కాశ్మీర్ లో సీఆర్పీఎఫ్ జవాన్లపై ఉగ్రవాదులు జరిపిని దాడిని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా ఖండించారు.  ఈ దాడిలో అనేక మంది జవాన్లు మరణించడంతో పాటు చాలా మంది తీవ్రంగా గాయపడడం పట్ల సిఎం తీవ్రంగా కలత చెందారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢమైన సానుభూతి తెలిపారు.


ఉగ్రదాడికి ఖండించిన కేసీఆర్..జన్మదిన వేడుకలు వద్దని నిర్ణయం

కాశ్మీర్ లో జరిగిన దాడి నేపథ్యంలో దేశ ప్రజలంతా విషాదంలో మునిగిపోయారని,  తాను కూడా తీవ్రంగా మనస్థాపానికి గురయ్యానని కేసీఆర్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఈ నెల 17న తన పుట్టిన రోజు సందర్భంగా ఎలాంటి ఉత్సవాలు జరుపుకోరాదని ముఖ్యమంత్రి నిర్ణయించారు.  పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎవ్వరూ తన పుట్టిన రోజు వేడుకలు జరపవద్దని ముఖ్యమంత్రి కోరారు.